అమితాబ్ బచ్చన్ ఈసారి లాలాబాగ్ చా రాజా పండాల్ కి వెళ్లి దర్శనం చేసుకోలేదు కానీ, గణపతికి లక్షల్లో చందా మాత్రం ఇచ్చారు. ఇక ఈ విషయంలో  నెటిజన్లు అమితాబ్ ను  ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే? 

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా లక్షలాది మందిలాగే గణపతి భక్తుడు. ప్రతి సంవత్సరం, బిగ్ బి తన కుటుంబంతో కలిసి ముంబైలోని ప్రసిద్ధ లాలాబాగ్ చా రాజాను దర్శించుకుంటారు. అయితే, ఈసారి ఆయన అక్కడికి వెళ్లలేకపోయినా, ఈ పండగ కి మాత్రం ఆయన భారీగా దానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బి దానంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అమితాబ్ ఎంత దానం చేశారు?

లాలాబాగ్ చా రాజా కార్యదర్శి సుధీర్ సాల్వి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఆయన గణపతి విగ్రహం దగ్గర చెక్కు పట్టుకుని నిల్చున్నట్టు కనిపిస్తున్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ ఓ పాపరాజీ పేజీ, 'అమితాబ్ బచ్చన్ లాలాబాగ్ చా రాజాకి 11 లక్షల రూపాయలు ఉదారంగా దానం చేశారు. దాన్ని కార్యదర్శి సుధీర్ సాల్వి స్వీకరించారు' అని రాసుకొచ్చింది. లాలాబాగ్ చా రాజా ట్రస్టీలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బిగ్ బిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 'పంజాబ్ లో వరద బాధితులకి సాయం చేస్తే బాగుండేది. పెద్దవాళ్ళు, చిన్న ఆలోచనలు' అని ఒకరు అన్నారు. 'పంజాబ్ కి కూడా సాయం చేయండి. దేవుడికి సాయం చేయడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజలకి సాయం చేయండి' అని మరొకరు అన్నారు. ప్రస్తుతం పంజాబ్ లో భారీ వరదలు వచ్చాయి. 1300 కి పైగా గ్రామాలు మునిగిపోయాయి. ఈ వరదల వల్ల చాలా నష్టం జరిగింది, 37 మందికి పైగా చనిపోయారు.

View post on Instagram

లాలాబాగ్ చా రాజాను దర్శించుకున్న సెలబ్రిటీలు

1934లో స్థాపించబడిన లాలాబాగ్ చా రాజా సార్వజనిక గణేష్ ఉత్సవ మండలి ముంబైలో ఉంది. ఇక్కడ లక్షలాది మంది భక్తులు గణపతి బప్పా ఆశీస్సులు కోసం వస్తుంటారు. ప్రతి సంవత్సరం లాగానే 2025లో కూడా శిల్పా శెట్టి, మలైకా అరోరా, జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఇంకా చాలామంది సెలబ్రిటీలు లాలాబాగ్ చా రాజాను దర్శించుకున్నారు.