- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 20వ తేదీ)లో సుమిత్ర కోసం కంగారుపడ్డ దీప. శ్రీధర్ విషయంపై ఇంట్లో రచ్చ చేసిన జ్యోత్స్న. దీప కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో కార్తీక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది దీప. నోట్లో నుంచి రక్తం ఎందుకు పడుతుందని అడుగుతుంది. ఎవరికి పడింది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటాడు కార్తీక్. నువ్వు చెప్పు బావ నోట్లో నుంచి రక్తం ఎందుకు పడుతుందని మళ్లీ అడుగుతుంది దీప.
కార్తీక్ కొన్ని కారణాలు చెప్తాడు. అయితే అమ్మకు ఏదైనా వ్యాధి వచ్చిందా? అని కంగారు పడుతుంది దీప. నోట్లో నుంచి రక్తం పడింది అత్తకా? సరే నువ్వు కంగారు పడకు. మనం ముందు మామయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడుదాం అని ఇద్దరూ కలిసి వెళ్తారు.
అత్తకు ఏమైంది?
ఏంటి మామయ్య ఇది. అత్తకు ఏమైంది? వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకెళ్లు అంటాడు కార్తీక్. వారి మాటలను సుమిత్ర వింటుంది. నేను ఎందుకు హాస్పిటల్ కి వెళ్లాలి. నేనేదో కాస్త నీరసంగా ఉంటే ఇంత పెద్ద సీన్ చేయాలా? నాకు ఏం కాలేదురా అంటుంది సుమిత్ర.
ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ లు చేయించుకో అమ్మ అంటుంది దీప. ముందు నువ్వు చేయించుకోవాలి అంటుంది సుమిత్ర. నేను బాగానే ఉన్నాను మీరు వెళ్లిరండి అంటుంది సుమిత్ర. నాకేం కాలేదు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటుంది సుమిత్ర.
ఆరోగ్యం బాగోలేదన్న దశరథ
నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి టెస్టులు చేయించుకుందాం అంటాడు దశరథ. అయ్యో మీకు ఏమైందని కంగారు పడుతుంది సుమిత్ర. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా.. మనం వెళ్దాం పదండి అని ఇద్దరూ కలిసి హాస్పిటల్ కి బయల్దేరుతారు.
మా అమ్మకు ఏం కావొద్దు..
చిన్నప్పుడే ఒక అమ్మను పోగొట్టుకున్నాను. ఇప్పుడు మరొకరిని కోల్పోయే శక్తి నాకు లేదు. మా అమ్మకు ఏం కావొద్దు దేవుడా.. అని ఏడుస్తుంది దీప. ఏం కాదు అత్త ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు కూడా అదే మాట చెప్తారు. నువ్వు కంగారు పడకు. అది నీకు, మన బిడ్డకు మంచిది కాదని చెప్తాడు కార్తీక్.
సుమిత్ర గారితో నిజం చెప్పను
హాస్పిటల్లో సుమిత్రకు చాలా రకాల టెస్టులు రాస్తాడు డాక్టర్. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మా వారికి చేయించండి టెస్టులు అంటుంది సుమిత్ర. ఆయనకు ఇంతకంటే పెద్ద లిస్టే ఉంది. మీరు చేయించుకోండి అంటాడు డాక్టర్. సరే మీరు జాగ్రత్తగా చేయించుకొని రండి అని వెళ్తుంది సుమిత్ర. కంగారు పడకండి దశరథ గారు నేను సుమిత్ర గారితో ఏం చెప్పను అంటాడు డాక్టర్. థాంక్యూ చెప్తాడు దశరథ.
రచ్చ చేసిన జ్యోత్స్న
కోపంగా ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తుంటాడు శివన్నారాయణ. జరిగిన విషయం నాకూ తెలుసు. మీరు కూడా తెలుసుకోండి అని అందరిని పిలిచి శ్రీధర్ అరెస్ట్ వీడియోను చూపిస్తుంది జ్యోత్స్న. దొరికిందే అవకాశంగా కంపెనీ పరువు తీశారని రచ్చ రచ్చ చేస్తుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ లపై రెచ్చిపోతుంది పారు.
రెచ్చిపోయిన పారు
ఆ రోజు మీ తాత.. మీ నాన్నను గెంటేశాడు కాబట్టే.. ఈ రోజు ఇలా రివేంజ్ తీసుకున్నాడని అంటుంది పారు. మీ నాన్న ఇలాంటి వాడు కాబట్టే మీ అమ్మ తనని వదిలేసింది అంటుంది జ్యోత్స్న. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు కార్తీక్. ఎవ్వరు ఎన్ని చెప్పినా మా నాన్న ఎలాంటివాడో నాకు తెలుసు. ఎక్కడో ఏదో జరిగింది. తాత మనం ముందు స్టేషన్ కి వెళ్దాం పదా అంటాడు కార్తీక్.
తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించాలి నువ్వు వెళ్లకు తాత అంటుంది జ్యోత్స్న. మీరు కాస్త ఆపుతారా? అని కార్తీక్ కి తీసుకొని బయటకు వెళ్తాడు శివన్నారాయణ. మనుమరాలా.. మనకు అవకాశం దొరికింది. దీన్ని మనం అస్సలు వదిలిపెట్టొద్దు అంటుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

