జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్, లక్షలు పలికిన తారక్ బొమ్మ, ఎవరు కొన్నారంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఓ అభిమాని స్వయంగా గీసిన పెన్సిల్ స్కెచ్ ను రీసెంట్ గా వేలం వేశారు. మరి ఆ బొమ్మ ఎన్ని లక్షలు పలికిందో తెలుసా?

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలతో తన మార్క్‌ను చూపిస్తున్నారు. రీసెంట్ గా తారక్ బాలీవుడ్ నుంచి వార్ 2 మూవీతో ఆడియన్స్ ను అలరించాడు. హుతిక్ రోషన్ తో కలిసి ఆయన నటించిన "వార్ 2" సినిమా, భారీ అంచనాల నడుమ విడుదలైన అభిమానులను పూర్తిగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎమోషనల్ డ్రామా “డ్రాగన్” లో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈసినిమా తరువాత ఆయన దేవర2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఈసారి కారణం సినిమా కాదు, ఒక అద్భుతమైన పెన్సిల్ స్కెచ్. ఎన్టీఆర్ కు మహిళా వీరాభిమాని, తన స్వహస్తాలతో ఆయన పెన్సిన్ స్కెచ్ ను అద్భుతంగా గీశారు.
తెలుగు అమ్మాయి బ్యులా రూబీ పెన్సిల్ ఆర్ట్‌ల ద్వారా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందుతోంది. సినిమా ప్రముఖుల స్కెచ్‌లు గీయడంలో ఆమెకు ప్రత్యేకత ఉంది. ఆమె గీసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ స్కెచ్‌ను చూసిన ఓ ఎన్టీఆర్ అభిమాని అమెరికా నుండి బ్యులా రూబీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సందేశం పంపించాడు. తనకు ఆ ఆర్ట్ చాలా నచ్చిందని, దాన్ని కొనుగోలు చేయాలని మనసు ఉందని తెలిపాడు.
ఆ అభిమాని, బ్యులా రూబీ గీసిన ఎన్టీఆర్ స్కెచ్‌ను 1650 డాలర్లకు కొనుగోలు చేశాడు. ఇది భారతీయ కరెన్సీలో సుమారుగా రూ. 1.45 లక్షలుగా ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని బ్యులా రూబీ స్వయంగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా పంచుకుంది. “ఇది నేను గీసిన తెలుగు హీరోల పెన్సిల్ స్కెచ్‌లలో అత్యధిక ధరకు అమ్ముడైనది. ఈ స్థాయిలో నా ఆర్ట్‌కు స్పందన వస్తుందని ఊహించలేదు. ఎంతో సంతోషంగా ఉంది,” అని ఆమె వెల్లడించారు.
ఈ వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో బ్యులా రూబీ టాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు. “స్కెచ్ అద్భుతంగా ఉంది”, “రియలిస్టిక్ ఆర్ట్”, “ఇది కళ కాదు, కళాఖండం” వంటి కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కెచ్‌తోపాటు బ్యులా రూబీ పేరు కూడా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇకపోతే, ఎన్టీఆర్ ప్రస్తుతం "డ్రాగన్" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది.