MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?

Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?

బ్రహ్మానందం, యోగిబాబు, నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన `గుర్రం పాపి రెడ్డి` మూవీ శుక్రవారం విడుదలైంది. శవాన్ని మార్చే కథ ఎలా ఉందంటే? 

4 Min read
Author : Aithagoni Raju
Published : Dec 20 2025, 07:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ
Image Credit : Asianet News

గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ

బ్రహ్మానందం, యోగిబాబు కలిసి నటించిన తాజా చిత్రం `గుర్రం పాపిరెడ్డి`. ఇందులో నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లాతోపాటు జీవన్‌, కసిరెడ్డి రాజ్‌ కుమార్‌, వంశీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మురళీ మనోహర్‌ దర్శకుడు. డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం(డిసెంబర్‌ 19న) విడుదలైంది. మరి ఇది ఆడియెన్స్ నవ్వించిందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
గుర్రం పాపిరెడ్డి మూవీ కథ
Image Credit : Asianet News

గుర్రం పాపిరెడ్డి మూవీ కథ

గుర్రం పాపిరెడ్డి(నరేష్‌ అగస్త్య) అప్పుడే జైలు నుంచి వచ్చిన ఉడ్రాజు(యోగిబాబు)తో కలిసి బ్యాంక్‌ దొంగతనానికి పాల్పడతాడు. ఈ దొంగతనంలో తన పాత ఫ్రెండ్స్ మిలటరీ(కసిరెడ్డి), చిలిపి(వంశీధర్‌ గౌడ్‌)లతోపాటు గొయ్యి(జీవన్‌)లను కూడా చేర్చుకుంటారు. వీరందరితో కలిసి దొంగతనం పాల్పడతారు. దొంగతనం చేస్తారు, కానీ పోలీసులకు దొరికిపోతాడు. నగలు, వజ్రాలతో ఉడ్రాజు పారిపోతాడు.  పాపిరెడ్డి అండ్‌ బ్యాచ్‌ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. జైలు నుంచి బయటకు పిచ్చి ఆసుపత్రిలోని నర్సు సౌదామిని(ఫరియా అబ్దుల్లా)తో, తన గ్యాంగ్‌తో కలిసి వేల కోట్లు కొల్లగొట్టే ప్లాన్‌ వేస్తారు. శ్రీశైలం అడవుల్లో ఉన్న శవాన్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లోని క్రిష్ణానగర్‌లోని శ్మశానవాటిలో కళింగ పోతురాజు సమాధిలో పూడ్చే ప్లాన్‌ చేస్తారు. అనేక కష్టాలు పడి ఆ పని పూర్తి చేస్తారు. అనంతరం కళింగ వంశీయుల ఆస్తులపై కేసు వేస్తారు. గొయ్యినే కళింగ పోతురాజు మనవడు అని, తనని తమ కుటుంబీకునిగా గుర్తించాలని చెప్పి వారికి లేఖ రాస్తాడు. అనంతరం కేసు వేస్తారు. మరి శ్మశాన వాటికలో గొయ్యిలు తీసే గొయ్యికి, కళింగ వంశీయులకు సంబంధం ఏంటి? దీని వెనుక ఉన్న గుర్రం పాపిరెడ్డి అసలు ప్లానేంటి? దీనికోసం ఎంత మందిని బలిచేశాడు? ఈ కేసులో గెలుపు ఎవరిది? ఈ జర్నీలో స్టుపిడిటీకి కేరాఫ్‌గా నిలిచే మిలటరీ, చిలిపి, గొయ్యి, సౌదామిని ఏం చేశారు? దీనికి జడ్జ్(బ్రహ్మానందం) ఎలా హెల్ప్ అయ్యాడు? అనంతరం ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.

Related Articles

Related image1
Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Related image2
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌
37
గుర్రం పాపిరెడ్డి సినిమా ఎలా ఉందంటే
Image Credit : Asianet News

గుర్రం పాపిరెడ్డి సినిమా ఎలా ఉందంటే

డార్క్ కామెడీ చిత్రాలు అడపాదడపా వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి అర ఆడియెన్స్ ని నవ్వించడంలో సక్సెస్‌ అవుతున్నాయి. అయితే ఇలాంటి సినిమాల విషయంలో పేపర్‌పై ఉన్న కామెడీ తెరపై ఆవిష్కరించే క్రమంలో మిస్‌ ఫైర్‌ అవుతుంటాయి. అక్కడే చాలా సినిమాలు తేడా కొడుతుంటాయి. కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్‌ అవుతాయి. `గుర్రం పాపిరెడ్డి` మూవీ కూడా ఈ కోవకి చెందినదే. డార్క్ కామెడీ ఇందులో చాలా వరకు వర్కౌట్‌ అయ్యింది. డార్క్ కామెడీలో ఇదొకి భిన్నమైన సినిమాగా చెప్పొచ్చు. ఎంచుకున్న కథ మాత్రం చాలా క్రేజీగా ఉంది. సినిమా ప్రారంభంలో జడ్జ్ బ్రహ్మానందం స్టుపిడిటీ గురించి వివరిస్తారు. అలా స్టుపిడిటీతో ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు ఎలాంటి క్రేజీ పనులు చేశారనేది  ఆసక్తికరం. ఈ క్రేజ్‌ పనులు చేసే క్రమంలో జనరేట్‌ అయ్యే కామెడీని నమ్ముకుని ఈ మూవీని రూపొందించారు. ఆ కామెడీని జనరేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. ప్రారంభంలో సినిమా కొంత లౌడ్‌గా ఉంటుంది. స్టుపిడిటీగానే సాగుతుంది. చూసే ఆడియెన్స్ కి కూడా అలాంటి ఫీలింగ్‌ కలుగుతుంది. చిరాకుగా అనిపిస్తుంది. కానీ వెళ్లే కొద్ది ఆ స్టుపిడిటీనే బలంగా మారుతుంది. నవ్వులు జనరేట్‌ చేయడం స్టార్ట్ చేస్తాయి. బ్యాంక్‌ రాబరీ చేసి, గొడవపడి పోలీసులకు దొరికిపోవడం, శవాన్నితీసుకొచ్చేందుకు వెళ్లి మళ్లీ వీళ్లకు వీళ్లు గొడవ పడటం, ప్లాన్‌ ని సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ చేసేక్రమంలో అనేక చెత్త చెత్త పనులు చేయడం బాగుంది. శవాన్ని మార్చి కళింగ రాజవంశస్థులపై కేసు వేయడం, ఆ కేసు గెలిచేందుకు సాక్షాల విషయంలో వీళ్లు చేసే క్రేజీ పనులు నవ్వులు పూయిస్తాయి. కోర్ట్ లో జడ్జ్ బ్రహ్మానందం చేసే అసహనంతో కూడిన కామెడీ, అదే సమయంలో పంచ్‌ డైలాగ్‌లు అలరిస్తాయి. సెకండాఫ్‌లోనూ ఇదే తరహా కామెడీని వర్కౌట్‌ చేశారు. అయితే మొదటి భాగంతో పోల్చితే సెకండాఫ్‌లో ఫన్‌ సహజంగా వర్కౌట్‌ అయ్యింది. చాలా వరకు నవ్వించడంలో సక్సెస్‌ అయ్యింది. ఈ గుర్రంపాపిరెడ్డి గ్యాంగ్‌ చేసే చెత్త పనులు, గొడవలు, క్రేజీ పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా గొయ్య పాత్ర సైతం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్ లో నరేష్‌ అగస్త్య ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. దీంతో మిగిలిన అందరు స్టుపిడ్స్ గా మిగిలిపోవడం క్రేజీ అని చెప్పొచ్చు.

47
హైలైట్స్, మైనస్‌లు
Image Credit : Asianet News

హైలైట్స్, మైనస్‌లు

సినిమాలో ఫన్‌ వర్కౌట్‌ అయ్యింది. ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్‌లో అది బాగా వర్కౌట్‌ అయ్యింది. బ్రహ్మానందం, యోగిబాబు పాత్రలు కాసేపే మెరిసినా బాగా అలరించారు. ప్రధానపాత్రలు సినిమాకి ప్రధాన బలం. బీజీఎం బాగుంది. ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని బాగా తెరకెక్కించారు. స్టుపిడిటీ అనే కాన్సెప్ట్ ని తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది.

మైనస్‌ల విషయానికి వస్తే, ఫస్టాఫ్‌లో కామెడీ అంతగా వర్కౌట్‌ కాలేదు. క్యారెక్టర్స్ ఓవర్‌ లౌడ్‌ చిరాకు తెప్పిస్తుంది. ఎంతసేపు కథ అక్కడక్కడే తిరుగుతుంది. విజువల్స్ పరంగా ఇంకా బాగా చేయాల్సింది. చాలా చోట్ల లాజిక్స్ మిస్‌ కావడం.

57
గుర్రం పాపిరెడ్డిలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

గుర్రం పాపిరెడ్డిలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

గుర్రం పాపిరెడ్డి పాత్రలో నరేష్‌ అగస్త్య చాలా బాగా చేశాడు, అదరగొట్టాడు. తనకు మంచి పేరుని తెచ్చే సినిమా అవుతుంది. సౌదామినిగా ఫరియా అబ్దుల్లా సైతం ఆకట్టుకుంది. క్రేజీ బ్యాచ్‌కి బాగా సెట్‌ అయ్యింది. గొయ్య పాత్రలో జీవన్ అదగొట్టాడు. సీరియస్‌గా కనిపించే ఆయన్ని కామెడీ జోన్‌లో ఆవిష్కరించిన మూవీ అవుతుంది. కసిరెడ్డి, వంశీధర్‌ గౌడ్‌ బాగా నవ్వించారు. బ్రహ్మానందం పాత్ర చాలా రోజుల తర్వాత నవ్వించింది. యోగిబాబు ప్రారంభంలో, ఎండింగ్‌లో మెరిసి హిలేరియస్‌గా నవ్వించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

67
టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

కృష్ణ సౌరభ్‌ సంగీతం బాగుంది. ఆర్‌ఆర్‌ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. అర్జున్‌ రాజా విజువల్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్‌ షార్ప్ గా ఉంది. అయినా కొంత షార్ప్ చేయోచ్చు. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు మురళీ మనోహర్‌ ఎంచుకున్న కథ క్రేజీగా ఉంది. సినిమాని కూడా అంతే క్రేజీగా తెరకెక్కించారు. కామెడీని వర్కౌట్ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. చాలా వరకు బాగానే ప్రయత్నించారని చెప్పొచ్చు. ఓవర్‌ హంగామా, డ్రామా కొంత మైనస్‌గా మారినా, చాలా వరకు నవ్వులు పూయించడంలో సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు.

77
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

క్రేజీ కామెడీ రైడ్‌ `గుర్రం పాపిరెడ్డి`. స్టుపుడిటీతో కూడిన నవ్వుల కోసం ఓసారి చూసేయొచ్చు.

రేటింగ్‌: 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Related Stories
Recommended image1
Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Recommended image2
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved