- Home
- Entertainment
- తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 షోలో 103 వ రోజు కళ్యాణ్, సంజనల జర్నీ లని బిగ్ బాస్ చూపించారు. ఎంతో అందమైన తమ బిగ్ బాస్ జర్నీ చూసి ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ తెలుగు 9 షోలో 103వ రోజు కూడా ఇంటి సభ్యుల జర్నీ గురించి బిగ్ బాస్ మాట్లాడారు. వారి జర్నీ లని ఏవీ రూపంలో చూపించారు. ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన ముందుగా బిగ్ బాస్ ని కాఫీ, చికెన్ కోసం ఫన్నీగా రిక్వెస్ట్ చేశారు. చికెన్, కాఫీ కోసం ఇమ్మాన్యుయేల్ ఏకంగా పవన్ తో అమ్మాయి వేషం వేయించి హంగామా చేశారు. అమ్మాయి వేషంలో ఉన్న పవన్ కి ఇమ్ము భర్తగా నటించాడు. వీరిద్దరి హంగామా నవ్వులు పూయించింది. దీనితో బిగ్ బాస్ చికెన్ కాకుండా మటన్ పంపి సర్ప్రైజ్ ఇచ్చారు.
సామాన్యమైన జర్నీ కాదు
ఆ తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ ని పిలిచి అతడి జర్నీ గురించి వివరించారు. సామాన్యుడిలా మీ ప్రయాణం మొదలైంది కానీ సామాన్యమైన జర్నీ మాత్రం కాదు అని బిగ్ బాస్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. జీరో నుంచి మొదలై కొన్ని కోట్ల మంది అభినందించే వరకు చేరుకున్నారు అని బిగ్ బాస్ అన్నారు. కళ్యాణ్ ఆట ఒక్కో వారం మెరుగుపడుతూ వచ్చింది అని తెలిపారు. ఆ తర్వాత కళ్యాణ్ జర్నీని బిగ్ బాస్ ఏవీ రూపంలో చూపించారు.
తనూజతో రొమాంటిక్ మూమెంట్స్
బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీ, సరదాలు, ఇంటి సభ్యులతో గొడవలు, తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, ఆమెకి చెప్పిన రొమాంటిక్ మాటలు ఇవన్నీ చూసి కళ్యాణ్ సంతోషంగా ఫీల్ అయ్యాడు. ముఖ్యంగా స్క్రీన్ పై తనూజ కనిపిస్తునప్పుడు కళ్యాణ్ హ్యాపినెస్ మరో లెవల్ లో ఉండింది. ఆ తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళాడు.
అవతల ఉన్నది ఎవరైనా సరే..
కళ్యాణ్ తర్వాత సంజన వచ్చింది. సంజనని కూడా బిగ్ బాస్ ప్రశంసించారు. సంజన ఎక్కడ అక్కడ ఏదో ఒకటి జరగడం ఖాయం. హంగామా ఉంటుంది అని ఆడియన్స్ భావించారు. హౌస్ లో చాలా సంఘటనలు సంజన చుట్టే జరిగాయి. ఒక మాటపై నిలబడితే అవతల ఉన్నది ఎవరైనా సరే వెనక్కి తగ్గని మొండి ధైర్యం సంజన సొంతం.
ఇమ్మాన్యుయేల్ తో బాండింగ్
దానివల్ల తనకి ఇష్టమైన వాళ్ళతో కూడా కొన్నిసార్లు పోరాడాల్సి వచ్చింది అని బిగ్ బాస్ తెలిపారు. ఆ తర్వాత సంజన ఏవీ చూపించారు. ఏవీ మొదలు కావడమే ఓజీ సాంగ్ తో ఎలివేషన్ ఇస్తూ మొదలైంది. ఎన్నో ఎమోషన్స్ ఉన్న తన జర్నీ చూసి సంజన భావోద్వేగానికి గురైంది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ తనని అమ్మ అని పిలవడం, అతడితో పంచుకున్న క్షణాలు చూసి సంజన హ్యాపీగా ఫీల్ అయింది.

