సారాంశం

పూనమ్‌ పాండే చనిపోయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా దీనిపై ఆమె స్పందించింది. సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. 

బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే చనిపోయినట్టు శుక్రవారం తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా పోస్ట్ పెట్టిన విసయం తెలిసిందే. ఈ పోస్ట్ చూసి అంతా షాక్‌ అయ్యారు. సర్వైకల్‌ కాన్సర్‌తో పూనమ్‌ చనిపోయిందని వారి పీఆర్‌ టీమ్‌ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ పెట్టింది. దీంతో ఇది పెద్ద దుమారం సృష్టించింది. అయితే దీనిపై చాలా రూమర్స్ వచ్చాయి. అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ గర్భాశయ కాన్సర్‌తో అంత త్వరగా చనిపోరని అంతా భావించారు. ఇదేదో పెద్ద కుట్ర, మోసం ఉందన్నారు. ఇదేదో పీఆర్‌ స్టంట్‌లాగా ఉందన్నారు. 

తాజాగా అదే చేసింది పూనమ్‌ పాండే. తాను బతికే ఉన్నట్టు తాజాగా పోస్ట్ పెట్టింది. తాను చనిపోలేదని చావు కబురు చల్లగా చెప్పింది. కాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో తాను ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపింది.  అయితే సర్వైకల్‌ కాన్సర్‌ వల్ల ప్రతి ఏడాది చాలా మంది మహిళలు మరణిస్తున్నారు. దానికి ట్రీట్‌మెంట్‌ ఎలా తీసుకోవాలో తెలయడం లేదని, వారికి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో తాను ఇలా చేసినట్టు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ వీడియో పోస్ట్ చేసింది పూనమ్‌ పాండే. 

View post on Instagram
 

`కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది. HPV వ్యాక్సిన్ ద్వారా ఈ కాన్సర్‌ని ముందస్తుగా గుర్తించే పరీక్షలలో కీలకమైనది. ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు మా వద్ద ఉన్నాయి. దీనిపై అవగాహనతో ఒకరినొకరు శక్తివంతం చేద్దాం. ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి తెలియజేయబడుతుంది. ఏమి చేయవచ్చో లోతుగా పరిశోధించడానికి బయోలోని లింక్‌ని సందర్శించండి. కలిసి, వ్యాధి వినాశకరమైన ప్రభావాన్ని అంతం చేయడానికి  కృషి చేద్దాం` అని పేర్కొంది పూనమ్‌ పాండే.

Read more: పూనమ్‌ పాండే చనిపోలేదా? ఇదంతా పీఆర్‌ స్టంటేనా? ఆధారాలు బయటపెడుతున్న నెటిజన్లు..

తాజాగా ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. అదే సమయంలో దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాన్సర్‌ ప్రమోషన్‌ కోసం చావుతో చెలగాటం ఆడతారా అంటూ మండిపడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు.  ఆమెని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 

Also read: Poonam Pandey Death : ఇంటర్నెట్ సెలబ్రిటీ పూనమ్ పాండే 5 అతిపెద్ద వివాదాలు