Asianet News TeluguAsianet News Telugu

Poonam Pandey Death : ఇంటర్నెట్ సెలబ్రిటీ పూనమ్ పాండే 5 అతిపెద్ద వివాదాలు

పూనమ్ పాండేకు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. వారంతా ఇప్పటికీ పూనమ్ పాండే మరణవార్తను పూర్తిగా నమ్మడం లేదు. అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Poonam Pandey Death : 5 Biggest Controversies of Internet Celebrity Poonam Pandey - bsb
Author
First Published Feb 3, 2024, 8:44 AM IST

న్యూఢిల్లీ : రియాల్టీ షో 'లాక్ అప్'లో చివరిసారిగా కనిపించిన మోడల్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మరణించినట్లు ఆమె బృందం శుక్రవారం తెలిపింది. 32 ఏళ్ల వివాదాస్పద నటి, మోడల్ మరణ వార్త వెలుగు చూడడంతో.. పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  సంతాపం తెలిపారు. అయితే, మరోవైపు నెటిజన్లు మాత్రం ఈ వార్తపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ పాండేకు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. 

బోల్డ్ షూట్‌లకు పెట్టింది పేరు పూనమ్ పాండే. అంతేకాదు తరచుగా ఎవ్వరూ ఊహించనైనా ఊహించని పోస్టులతో వివాదాస్పదంగా మారారు. తరచుగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వైరల్ అవుతుంటారు. ఇప్పటివరకు పూనమ్ పాండే అతిపెద్ద కాంట్రావర్సీలు ఏంటంటే... 

 

1
ప్రపంచ కప్ 2011 స్ట్రిప్పింగ్ వివాదం

2011లో పూనమ్ పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే టీమ్ ఇండియా కోసం బట్టలు విప్పుతానని ప్రకటించింది. దీంతో క్రికెట్ అభిమానులతో పాటు అందరి దృష్టినీ ఆకర్షించింది. కాగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమెను అలా చేయకుండా అడ్డుకుంది. 

2
IPL న్యూడ్ ఫోటోషూట్

2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అయితే, తాను ప్రకటించినట్లుగా దుస్తులు తీసేయడానికి బీసీసీఐ నిరాకరించడం తనను తీవ్రంగా బాధించిందని పూనమ్ పాండే పేర్కొంది. ఆ సమయంలో ఆమె వయసు 19 సంవత్సరాలు. అయితే, ఇక్కడితో ఆమె దాన్ని వదిలిపెట్టలేదు. ఆ తరువాతి యేడు తనకిష్టమైన ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీని గెలిస్తే ఇంటర్నెట్ లో సంచలనమే అంటూ ప్రకటించింది. అలాగే.. కేకేఆర్ ఛాంపియన్‌గా అవతరించగానే.. తాను చెప్పినట్టుగానే ఓ న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
3
కోవిడ్ లాక్‌డౌన్ అరెస్ట్

COVID-19 లాక్‌డౌన్ సమయంలో, పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబే వాకింగ్ కు వెళ్లారు. అలా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి, ఇబ్బందుల్లో పడ్డారు. ముంబై పోలీసులు ఈ దంపతులను అరెస్ట్ చేశారు. కరోనా సమయంలో ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనను అందరూ తీవ్రంగా విమర్శించారు.
4
పూనమ్ పాండే యాప్‌ను గూగుల్ బ్యాన్ చేసింది

2017లో, పూనమ్ పాండే ‘పాండే యాప్‌’ పేరుతో ఓ యాప్ ను ప్రారంభించింది. అయితే, దీని నిర్వహణలో కంటెంట్ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ గూగుల్ ఒక గంటలోపే ప్లే స్టోర్ నుండి యాప్‌ను తొలగించింది. ఇది డిజిటల్ రంగంలో భావప్రకటనా స్వేచ్ఛపై చర్చలకు దారితీసింది.
5
భర్తపై గృహహింస ఆరోపణలు
పూనమ్ పాండే 2021లో తన భర్తపై గృహహింస ఫిర్యాదును దాఖలు చేసింది, ఫలితంగా అతన్ని అరెస్టు చేశారు. రియాలిటీ షో 'లాక్ అప్' సందర్భంగా, మోడల్ తన వివాహంలో తాను అనుభవించిన గృహ హింసను వెల్లడించింది.

ఇక ఇప్పుడు..సర్వైకల్ క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడి ఆమె మరణించిందని పూనమ్ పాండే బృందం ఒక ప్రకటనలో తెలిపింది.

"ప్రియమైన నటి, సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన పూనమ్ పాండే, గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఈ ఉదయం మరణించడం విషాదకరం. వినోద పరిశ్రమకు ఇది షాక్. మేమంతా శోకంలో ఉన్నాం" అని ఆమె మేనేజర్ నికితా శర్మ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios