పూనమ్ పాండే చనిపోలేదా? ఇదంతా పీఆర్ స్టంటేనా? ఆధారాలు బయటపెడుతున్న నెటిజన్లు..
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే చనిపోయిందంటూ మార్నింగ్ ఆమె సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ కలకలం సృష్టించింది. అంతా షాక్‌లోకి వెళ్లారు. కానీ అది నిజం కాదా?
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే చనిపోయిందంటూ ఆమె సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెట్టిన పోస్ట్ కలకలం సృష్టించింది. సడెన్‌గా పూనమ్ పాండే చనిపోవడమేంటి? అంటూ అంతా షాక్ అయ్యారు. అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కానీ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడం పట్ల ఒకింత ఆశ్చర్యమేసినా, మరికొంత అనుమానాలకు తావిస్తుంది.
Poonam pandey
అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇదంతా ఫేక్ అని అంటున్నారు. జనాలను మోసం చేసే కార్యక్రమమే అంటున్నారు. పూనమ్ పాండే సడెన్‌గా మరణించడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఆమెకి సంబంధించిన వ్యాధిని శోధించే పనిలో పడ్డారు. సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయినట్టు ఆమె అకౌంట్ లో పెట్టిన పోస్ట్ లో ఉంది. అయితే దీనిపై అవగాహన ఉన్న వాళ్లు మాత్రం ఇది జరగడం అసంభవం అంటున్నారు.
గర్భాశయ ముఖద్వార కాన్సర్ తో మరణించడం చాలా అరుదుగా జరుగుతుందని చెబుతున్నారు. అదే సమయంలో సడెన్‌గా ఇది జరగదని అంటున్నారు. యాభై ఏళ్లలోపు ఉన్న వాళ్లు ఈ కాన్సర్‌కి గురైతే ట్రీట్‌మెంట్ ద్వారా బతికే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం పూనమ్ పాండే వయసు 32ఏళ్లే. ఇటీవలే ఆమె పెళ్లి చేసుకుంది. భర్తతో తరచూ గొడవలయ్యాయి. కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం, విడాకుల వరకు వెళ్లిందీ మ్యాటర్.
వీరి పెళ్లి కూడా నాలుగేళ్ల క్రితమే జరిగింది. ఏడాదికే భర్తతో విడిపోయారు. అయితే ఈ సర్వైకల్ కాన్సర్ సెక్స్ లో పాల్గొన్న తర్వాత వచ్చే అవకాశం ఉందట. భర్తతోనే లేదు కాబట్టి ఇది ఎలా సాధ్యం అంటున్నారు. మరోవైపు ఈ కాన్సర్ వచ్చిన వెంటనే ప్రాణాలు పోవడం జరగదని, కొన్నేళ్ల తర్వాత, అది పీక్ స్టేజ్‌లోకి వెళ్లాక జరుగుతుంది. ఇదంతా కొన్నేళ్లు పడుతుందని అంటున్నారు.
మొన్నటి వరకు పూనమ్ పాండే యాక్టివ్‌గానే ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. కానీ సడెన్‌గా ఇలా జరగడమేంటి? అంటున్నారు. పూనమ్ పాండే చనిపోవడమనేది చాలా వరకు ఫేక్ న్యూస్ అంటున్నారు. ఇదంతా పీఆర్ స్టంట్‌గా చెబుతున్నారు. ఇది ఏమైనా ప్రమోషన్ స్టంటా? లేక నిజంగానే చనిపోతే వేరే కారణం అయ్యుంటుందని, సర్వైకల్ కాన్సర్ అనేది కారణం కాదని అంటున్నారు. పూనమ్ పాండే మరణంలో నిజం ఉంటే కచ్చితంగా దీనిపై విచారణ జరిపించాలని అంటున్నారు. అదే సమయంలో చావుతో చెలగాటం ఆడుతారా? అనే కామెంట్ కూడా వినిపిస్తుంది.
పూనమ్ పాండే నిజంగానే చనిపోతే ఆమెకి సంబంధించిన మిగిలిన కార్యక్రమాల విషయాలు బయటకు రావాల్సింది. కానీ ప్రైవసీ పేరుతో అసలు రహస్యాలు దాచే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది. తాము వివరాలు వెల్లడించేంత వరకు తమని ఇబ్బంది పెట్టవద్దని ముందుగానే చెప్పారు. అంటే ఇందులో ఏదో మోసం ఉంది, ఇదంతా పెద్ద డ్రామా అయి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉంది.