సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఆయన మాజీ ప్రేయసి అంకిత లోఖండేల స్నేహితురాలైన ఓ హీరోయిన్ సుశాంత్ డెత్ కేసుపై అనేక సంచలన విషయాలు బయటపెట్టారు. సుశాంత్ మరణానికి కారణం వారే అంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. బాలీవుడ్ లో డ్రగ్ మాఫియా పాతుకుపోయి ఉందని, అదే సుశాంత్ జీవితాన్ని నాశనం చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్ పార్టీలలో డ్రగ్ పెద్ద ఎత్తున వాడతారు, డ్రగ్ పెడ్లర్స్, డీలర్లు మాత్రమే మనకు తెలుస్తుంది, వీరిని నడిపేది ఎవరో ఎవరికి తెలియదు. 

బాలీవుడ్ కి మరో పేరు డ్రగ్, నేను కూడా ఈ డ్రగ్ మాఫియా వలలో చిక్కుకున్నాను. అదృష్టవశాత్తు నేను బయటపడగలిగాను. డ్రగ్స్ అలవాటు లేకపోతే బాలీవుడ్ లో నిన్ను పల్లెటూరి అమ్మాయి అనుకుంటారని వారి చెప్పినట్లు ఆ హీరోయిన్ చెప్పడం జరిగింది. ఇక సుశాంత్ ని ట్రాప్ చేయడానికి డ్రగ్ మాఫియా రియాను వాడుకున్నారని ఆమె అన్నారు. 

ఈ డ్రగ్ మాఫియా సుశాంత్ కి స్లో పాయిజన్ ఇచ్చారు. సుశాంత్ జీవితం బలితీసుకుంది డ్రగ్  మాఫియానే అని సదరు నటి చెప్పడం విశేషం. ఆమె వ్యాఖ్యలతో సుశాంత్ మరణానికి కారణం డ్రగ్ మాఫియాను అనే అనుమానం బలపడుతుంది. ఇక ఇప్పటికే డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, శోవిక్ చక్రవర్తి, శామ్యులు మిరాండాలతో పాటు కొందరు డ్రగ్ పెడ్లర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది.