నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఏకంగా వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), వైసీపీ ప్రజాప్రతినిధులకు(Ycp Leaders) జరిగిన విషయం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయకుడు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఏకంగా వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నందమూరి హీరో కళ్యాణ్‌రామ్(Nandamuri Kalyan Ram) స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 

`అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురు కావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా` అని kalyan Ram తెలిపారు. 

ఈ సందర్భంగా తాత ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌లను పంచుకున్నారు కళ్యాణ్‌ రామ్‌. పూజ్యులు తాతగారు రామారావుగారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామని పేర్కొన్నాడు. మరోవైపు బాలకృష్ణ మీడియా ముందు స్పందిస్తూ తన చెల్లి భువనేశ్వరిపై వ్యక్తిగత దాడి దురదృష్టకరమని తెలిపారు. వ్యక్తిగత దూషణలు సరికావని, రాజకీయాలతో సంబంధం లేని వారిపై వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే చేతులు ముడుచుకుని కూర్చోమని, బద్దలు కొట్టుకుని వస్తామని వైసీపీ నాయకులకు వార్నింగ్‌ ఇచ్చారు. 

Scroll to load tweet…

ఇక కళ్యాణ్‌ రామ్‌ చివరగా `ఎంత మంచివాడవురా` చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మరోవైపు ఇప్పుడు ఆయన `బింబిసార` చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు కొత్తగా మరో నాలుగు సినిమాలకు కమిట్‌ అయ్యాడు కళ్యాణ్‌ రామ్‌. అవన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇకపై బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆయన సందడి చేసేందుకు రాబోతున్నారు. 

also read: Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం

also read: కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడవు, నీకు పార్టీ పగ్గాలు కావాలా?... ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన లోకేష్ ఫ్యాన్స్!