కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడవు, నీకు పార్టీ పగ్గాలు కావాలా?... ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన లోకేష్ ఫ్యాన్స్!
అసెంబ్లీ సాక్షిగా నా భార్యకు అవమానం జరిగింది. దీన్ని నేను సహించలేకపోతున్నాను... అంటూ మీడియా ఎదుటే బోరున ఏడ్చేశాడు నారా చంద్రబాబు నాయుడు. ఈ పరిణామం టీడీపీ వర్గాలలో ఆవేశం కట్టలు తెచ్చుకునేలా చేసింది.
40 ఏళ్ల రాజకీయ ఉద్దండుడు బాబు ఇలా నిబ్బరం కోల్పోయి చిన్నపిల్లాడిలా ఏడవడం ఊహించని పరిణామమే. రాజకీయాలతో సంబంధం లేని ఆడవాళ్లపై వ్యక్తిగత దూషణలు చేయడం ఏమిటని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ లీడర్ పురంధేశ్వరి తో పాటు బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ ఫ్యామిలీ ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదని, కొంచెం గట్టిగానే చెప్పారు.
అయితే చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్ ని జూనియర్ ఎన్టీఆర్ ని కార్నర్ చేయడానికి టీడీపీలోని ఆయన యాంటీ ఫ్యాన్స్ వాడుకుంటున్నారు. ఈ సంఘటన వాడుకొని ఆయనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ రెండు వర్గాలు ఉన్నాయి.
ఒక వర్గం టీడీపీ పార్టీ చంద్రబాబుదే, ఆ పార్టీ వారసత్వం లోకేష్ దే అంటారు. అయితే లోకేష్ సమర్ధత మీద నమ్మకం లేని టీడీపీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ వైపు మొగ్గుచూపుతోంది. లోకేష్, చంద్రబాబు నాయకత్వంలో పార్టీ కూలిపోయిందని, ఫీలవుతున్న ఆ పార్టీ క్యాడర్.. ఎన్టీఆర్ ని రంగంలోకి దించాలంటూ బాబుపై ఒత్తిడి తెస్తున్నారు. దాని ఫలితమే చంద్రబాబు నాయుడు టూర్స్ లో వెలిసే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు.
ఇది ససేమిరా నచ్చని బాబు, వాళ్ళు ఓ పక్క నుండి 'ఎన్టీఆర్... ఎన్టీఆర్' అంటూ నినాదాలు చేస్తున్నా పట్టించుకోడు. విషయం దాటవేసి మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోతాడు. పార్టీలోకి ఎన్టీఆర్ రాక బాబుతో పాటు, లోకేష్, బాలయ్యకు కూడా ఇష్టం లేని వ్యవహారం. ఏదో అవసరానికి ఓట్లు కోసం టెంపరరీ ప్రవేశానికి మాత్రమే ఎన్టీఆర్ కి వీలుంది. ఓ దశలో బాలయ్య ఫ్యాన్స్ ఎన్టీఆర్ సినిమాపై దుష్ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కాగా టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతిలో పెట్టాలని డిమాండ్ చేస్తున్న కేడర్ ని ఈ విషయంలో లోకేష్, బాలయ్య ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. పార్టీ కష్టాలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు ఎలా ఇస్తారు. తన పాటికి తాను పార్టీతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ఉంటే.. పిలిచి పార్టీ బాధ్యతలు అప్పగించాలా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు.
అత్తయ్య భువనేశ్వరి పై జరిగిన దుష్ప్రచారం, అవమానకర వ్యాఖ్యలపై స్పందించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ రావాలి అంటూ నినాదాలు చేసే ఫ్యాన్స్ కి యాంటీ ఫ్యాన్స్ చురకలు అంటిస్తున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫోకస్ లోకి వచ్చినా రాకున్నా... ఎన్టీఆర్ కి మాత్రం ఇది తలనొప్పిగా మారింది.
2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ మేనియాలో ఆయన ప్రచారం పని చేయలేదు. తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలతో హరికృష్ణ, ఎన్టీఆర్ పార్టీకి దూరం అయ్యారు.
బాబు-ఎన్టీఆర్ మధ్య ఫ్యామిలీ రిలేషన్స్ కూడా లేకుండా పోయాయి. 2014లో బాబు అధికారం చేపట్టినా.. ఎన్టీఆర్ ని దరిచేరనీయలేదు. హరికృష్ణ మరణించిన నాడు, బాబు ఆ ఇంటి గడప తొక్కారు.
Also read EMK: ఎన్టీఆర్ గెస్ట్ గా మహేష్... సర్వం సిద్ధం!
Also read EVK: రాజా రవీంద్రకు కోటి రూపాయలు తెచ్చి పెట్టిన ఆ మూడు ప్రశ్నలు ఇవే, మీకు ఆన్సర్స్ తెలుసా?