Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చంద్రబాబు (Chandrababu Naidu)  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. 

Chandrababu Breakdown in Tears During in Press Meet

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చంద్రబాబు (Chandrababu Naidu)  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.  తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని.. తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో తెల్చకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. 

‘బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలను గురిచేసినా భరించాం. అధికారంలో ఉన్నప్పుడూ నేనెవరినీ కించపరచలేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా శాసన సభలో నా తల్లిని అవమానించారు. ఆనాడు వైఎస్ తప్పు ఒప్పుకుని నాకు క్షమాపణ చెప్పారు. అవతలి వ్యక్తులు బూతులు తిడుతున్నా.. సంయవనం పాటిస్తున్నాను. రేండున్నరేళ్లుగా అవమానిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు. అధికారంలోకి వచ్చాక మా పార్టీ నేతలను అరెస్ట్ చేయడమే పనిగా పెట్టున్నారు.  నా భార్య ఆమె వ్యక్తిగత జీవితం కోసం, నా కోసం మాత్రమే పని చేసింది. ముఖ్యమంత్రి భార్యగా ఉన్న సమయంలో ఆమె ఏ రోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య పోత్సహించింది. హుద్ హుద్ తుపాన్ సమయంలో విశాఖపట్నంలో చాలా రోజులు ఉన్నాను శాసన సభలో తన ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆలోచించుకోవాలి. నేను మాట్లాడుతుండగానే నా మైక్ కట్ చేశారు.

Also read: Chandrababu Naidu: మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా.. చంద్రబాబు శపథం.. అసెంబ్లీలో తీవ్ర భావోద్వేగం..

గతంలో తమ్మినేని సీతారాం టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గౌరవంగా బతికేవాళ్లను కించపరుస్తున్నారు. 40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడటానికా అని బాధపడుతున్నాను. నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మీ భార్యలకు అవమానం జరిగితే ఎలా ఫీలవుతారు. అందరం కూడా మనషులమే. అదే నా బాధ.. నాది ఇప్పుడు. క్షేత్ర స్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తాను. అసెంబ్లీలోనే ఈ మాట చెప్పాలని అనుకున్నాను. మైక్ కట్ చేశారు. ప్రజలు సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సహకరిస్తాను’అని చంద్రబాబు అన్నారు. 

అంతకుముందు.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ గెలిచిన తర్వాత.. సీఎంగా మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి (Andhra Pradesh Assembly) వస్తానని శపథం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం రెండో రోజు కొనసాగుతున్నాయి. సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios