నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమా ఈ మధ్యే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మన దేశంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ట్వీట్స్ చేసిన సినిమాగా ఇది హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధ్యం కావడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి హృదయ పూర్వక నమస్కారాలు అంటూ హరీష్ శంకర్ లెటర్ రాసాడు. ప్రతీ ఒక్కరి పేరు అందులో ఉంది ఒక్క నిర్మాత బండ్ల గణేష్ పేరు తప్ప. దాంతో ఆ విషయం  సంచలనంగా మారింది. 

దానికి బండ్ల గణేష్ స్పందిస్తూ.. అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలడు.. స్ట్రెయిట్ సినిమా తీసి హిట్ కొట్టి చూపించమనండి ఈ ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా.. హరీష్ శంకర్ అనే డైరక్టర్‌కు పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కల్పించింది నేను.. సినిమాలు లేక కిందా మీదా పడుతుంటే పవన్‌ను పరిచయం చేసింది నేను.. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న నల్లమలపు బుజ్జి ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్‌లో ఉంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను నేను.. ఫామ్ హౌజ్‌లో వుంటే తీసుకెళ్లి మిరపకాయ్ కథ పవన్ కళ్యాణ్‌కు వినిపించాను... ఆ తర్వాత అది కుదరకపోయినా కూడా గబ్బర్ సింగ్ అనుకున్నపుడు పవన్ గుర్తు పెట్టుకుని ఆ కుర్రాడ్ని పిలిపించండి అంటూ పిలిచాడు అన్నారు. ఈ విషయమై హరీష్ శంకర్ మీడియా వద్ద స్పందించారు. 

హరీష్ శంకర్ మాటల్లోనే.. అనటానికి ఏముందండీ, ఎవరైనా ఏమైనా అనొచ్చు...అతను ఆంజినేయులు, తీన్ మార్ తీసి రోడ్ మీదకు వస్తే నేనే గబ్బర్ సింగ్ ఛాన్స్ ఇచ్చా అని అనొచ్చు..కానీ నేను అనను..ఎందుకంటే అది నా సంస్కారం కాదు. గబ్బర్ సింగ్ నాకు కళ్యాణ్ గారు ఇచ్చారు..దానికి ఫస్ట్ నాగబాబు గారు ప్రొడ్యూసర్. 

ఒక దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారో, ఒక మైత్రీ నవీన్ గారో ఏదైనా కామెంట్ చేస్తే...అయ్యో మన దగ్గర ఏదైనా తప్పు ఉందేమో అని నన్ను నేను సరిదిద్దుకుంటా..కానీ ఇక్కడ ఎవరి క్రెడిబులిటీ ఏంటి, ఎవరింటికి ఎవరు వెళ్లారో, ఎవరు ఏమి చేస్తామన్నారో అందరికీ తెలుసు కదా..క్రెడిబులిటీ లేని వ్యక్తుల గురించి మాట్లాడి నేను టైమ్ వేస్ట్ చేసుకోను.

అదే సమయంలో మామూలు జనర్ ఆడియన్స్ కి కూడా తెలుసు నేను ఏ విధంగా కెరీర్ మొదలెట్టానో, నాకు ఫస్ట్ బ్రేక్ ఎవరిచ్చారో. నేను నా కెరీర్ ని సినీ ఇండస్ట్రీలో మొదలెట్టా..సాఫ్ట్ వేర్ కంపెనీలో కాదు. నా మొదటి సినిమా షాక్ 2006 లో రిలీజ్ అయ్యింది. ఆయన మొదట సినిమా ఆంజనేయులు 2009లో రిలీజ్ అయ్యింది. ఎవరు..ఎవరికి లైఫ్ ఇచ్చారు ?.

నిజాయితీగా చెప్తున్నా, నేను కొద్దిగా డిఎస్ పి పేరు ఎనౌన్స్ చేసే  చిన్నపాటి హడావిడిలో నా ట్వీట్ లో బండ్ల పేరు మిస్సయ్యాను. నా తదుపరి ట్వీట్ లో నేను వెంటనే రెక్టిఫై చేసుకున్నాను అని చెప్పుకొచ్చారు దర్శకుడు హరీష్ శంకర్.