హరిహర వీరమల్లు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే విధంగా పెయిడ్ ప్రీమియర్స్ కి కూడా అనుమతి ఇచ్చారు. పెంచిన టికెట్ ధరల వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

DID YOU
KNOW
?
'డాడీ' కోసం పవన్ సాయం
తన సోదరుడు చిరంజీవి డాడీ చిత్రానికి పవన్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఖుషి, బద్రి చిత్రాలకు కూడా పవన్ స్టంట్ కొరియోగ్రఫీ చేశారు.

హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలకు అనుమతి 

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు చిత్ర యూనిట్ కి అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విశేషం. అదే విధంగా పెయిడ్ ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చారు. 

హరిహర వీరమల్లు చిత్రానికి ఏపీలో పెంచిన టికెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీలో 23వ తేదీ రాత్రి 9 గంటలకు పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించుకోవచ్చు. ప్రీమియర్ షోల కోసం టికెట్ ధర రూ 600 గా ప్రభుత్వం నిర్ణయించింది జీఎస్టీ అదనం. దీనితో ప్రీమియర్ షో టికెట్ ధర ఒక్కొక్కటి 700 వరకు ఉండే అవకాశం ఉంది. 

పెంచిన టికెట్ ధరలు ఇవే 

ఇక జూలై 24 నుంచి రెగ్యులర్ షోలకు 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు. పెంచిన టికెట్ ధరలు జూలై 24 నుంచి ఆగష్టు 2 వరకు అమలులో ఉంటాయి. పెంచిన టికెట్ ధరలు పరిశీలిస్తే.. సింగిల్ స్క్రీన్స్ లో లోయర్ క్లాస్ టికెట్ ధర రూ 100 (జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకోవచ్చు. అప్పర్ క్లాస్ టికెట్ ధర 150 (జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకోవచ్చు. అంటే సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ ధర రూ. 200 నుంచి రూ. 297 వరకు ఉంటుంది. 

ఇక మల్టిప్లెక్స్ లలో ఒక్కో టికెట్ ధరని 200(జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకోవచ్చు. అంటే పెంచిన తర్వాత టికెట్ ధర 397 వరకు ఉంటుంది. ఆ ధరల్ని బట్టి చూస్తే టికెట్ ప్రైస్ బాగా పెరిగింది అని చెప్పవచ్చు. ఈ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే. తెలంగాణలో ఎలా ఉంటుందో చూడాలి. 

టికెట్ ధరలపై ఏఎం రత్నం కామెంట్స్ 

టికెట్ ధరలపై నిర్మాత ఏఎం రత్నం మాట్లాడారు. టికెట్‌ రేట్ల పెంపుపై ఆయన మాట్లాడుతూ పెద్ద సినిమాలకు వందల కోట్లు బడ్జెట్‌ పెట్టి తీసే సినిమాలకు టికెట్‌ రేట్లు ఎక్కువగానే ఉండాలని అన్నారు. సినిమా చూడాలని ఆసక్తి చూపేవారే మొదటి మూడు రోజులు చూస్తారు. ఆ సమయంలో టికెట్‌ రేట్లు ఎక్కువగా ఉండటంలో తప్పులేదు. కానీ వీక్‌ డేస్‌లో తగ్గించుకోవచ్చు, అలా చేస్తే జనరల్‌ ఆడియెన్స్ కి ఇబ్బంది ఉండదు అని ఆయన అన్నారు.పెద్ద బడ్జెట్‌ చిత్రాలకు కూడా తక్కువ రేట్లు పెడితే నిర్మాత ఏమైపోవాలి ? కామన్‌ ఆడియెన్స్ ని ఎవరూ సినిమా చూడమని ఫోర్స్ చేయరు. అది వాళ్ల ఇష్టం మాత్రమే, ఎక్కువ రేట్‌కి చూడాలనుకున్న వారు చూస్తారు అని అన్నారు.