- Home
- Entertainment
- హరిహర వీరమల్లుపై నిధి అగర్వాల్ ఫ్యామిలీ రియాక్షన్.. పవన్ స్పీచ్ లకు ఆమె గ్రాండ్ పేరెంట్స్ ఫ్యాన్స్ అట
హరిహర వీరమల్లుపై నిధి అగర్వాల్ ఫ్యామిలీ రియాక్షన్.. పవన్ స్పీచ్ లకు ఆమె గ్రాండ్ పేరెంట్స్ ఫ్యాన్స్ అట
తాను పవన్ కళ్యాణ్ గారితో నటిస్తున్నానని తెలిసి తన కుటుంబం ఆశ్చర్యపోయినట్లు నిధి అగర్వాల్ తెలిపింది. తన గ్రాండ్ పేరెంట్స్ కి కూడా పవన్ అంటే ఇష్టం అని తెలిపింది.
- FB
- TW
- Linkdin
Follow Us

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ హంగామా మొదలైంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే. పైగా పవన్ కళ్యాణ్ ఈ తరహా పీరియాడిక్ చిత్రంలో గతంలో ఎప్పుడూ నటించలేదు. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు ఈ చిత్రంపై అంచనాలు ఆశించిన స్థాయిలో లేవు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత పరిస్థితి మారిపోయింది.
జూలై 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఎక్కడ చూసినా నిధి అగర్వాల్ కనిపిస్తుండడం విశేషం. ఈ మూవీపై నిధి బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నార్త్ లో కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది హరిహర వీరమల్లు గురించి మాట్లాడుతున్నారు. మా ఫ్యామిలీ అయితే ఆశ్చర్యపోయారు. సౌత్ లో ఎలాగూ పవన్ కళ్యాణ్ గారి గురించి అందరికీ తెలుసు. నార్త్ లో కూడా ఇప్పుడు ఆయన చాలా మందికి తెలుసు. నార్త్ లో ఉన్న మా గ్రాండ్ పేరెంట్స్ కి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు అంటే చాలా ఇష్టం.
నేను హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాను అని తెలియగానే.. నువ్వు పవన్ కళ్యాణ్ తో వర్క్ చేస్తున్నావా అని ఆశ్చర్యపోయారు. ఆయన స్పీచ్ లు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి, చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు అని అన్నారు. హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ పంచమి పాత్రలో నటించింది. తన పాత్రలో ఊహించని ట్విస్ట్ ఉంటుంది అని నిధి అగర్వాల్ కామెంట్స్ చేసింది. ఈ చిత్రం కోసం నిధి అగర్వాల్ ప్రత్యేకంగా భరతనాట్యం, గుర్రపు స్వారీ నేర్చుకుంది.
నిధి అగర్వాల్ ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కూడా చేసిందట. భవిష్యత్తులో ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించే అవకాశం ఉందా అని యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నిధి నో అని సమాధానం ఇచ్చింది. తన లిమిట్స్ తనకి తెలుసు అని పేర్కొంది.