చిరంజీవికి తమ్ముడంతటి వాడు, ఆ పని చేసి ఉంటే ఇద్దరి మధ్య బంధం తెగిపోయేది
చిరంజీవికి తమ్ముడు లాంటివాడైన ఓ క్రేజీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అలాంటి పనులు చేసే వాడినే అయితే ఆయన తనని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు అని అన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు , ఆ సంఘటన ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

చిరంజీవి, శ్రీకాంత్ మధ్య అనుబంధం
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకున్నారు. సినిమాలపైనే తన ఫోకస్ మొత్తం ఉండేది. తన ప్రతిభతో వచ్చిన అవకాశాలని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచించేవారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్న నటులు, దర్శకులు ఎందరో ఉన్నారు. చిరంజీవి కూడా కొందరు నటుల్ని తన సొంత తమ్ముళ్ల లాగే భావిస్తారు.
చిరంజీవితో అంతటి అనుబంధం ఉన్న నటుడు శ్రీకాంత్. శ్రీకాంత్ దశాబ్దాలుగా టాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఒక దశలో ఫ్యామిలీ ఆడియన్స్ కి శ్రీకాంత్ ఫేవరెట్ హీరో. పెళ్లి సందడి లాంటి భారీ విజయాలు శ్రీకాంత్ కెరీర్ లో ఉన్నాయి. మొదట క్యారెక్టర్ రోల్స్ తో శ్రీకాంత్ ఆ తర్వాత హీరో అయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.
శంకర్ దాదా ఎంబీబీఎస్ లో శ్రీకాంత్
యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చిరంజీవి కి శ్రీకాంత్ పెద్ద అభిమాని. ఆయన ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చారు. ఇక తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు చిరంజీవి కోసం శ్రీకాంత్.. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ఏటీఎం అనే పాత్రలో నటించారు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. శ్రీకాంత్ ఈ చిత్రంలో తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు. ఆ తర్వాత శంకర్ దాదా జిందాబాద్ లో కూడా అదే పాత్రలో నటించారు.
రేవ్ పార్టీ సంఘటన
ఇటీవల టాలీవుడ్ లో మాదక ద్రవ్యాలు, రేవ్ పార్టీలు లాంటి సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత ఏడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సంఘటన పెద్ద కలకలం రేపింది. నటి హేమతో పాటు మరికొందరు అరెస్ట్ అయ్యారు. ఆ రేవ్ పార్టీలోనే హీరో శ్రీకాంత్ కూడా పాల్గొన్నట్లు ప్రచారం జరిగింది. ముఖం కనిపించకుండా శ్రీకాంత్ లాగే ఉన్న ఒక వ్యక్తి ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనితో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి.
శ్రీకాంత్ పై రూమర్స్
కానీ చివరికి అది ఫేక్ అని తేలింది. శ్రీకాంత్ ఆ పార్టీలో పాల్గొనలేదు. ఆ విషయంలో శ్రీకాంత్ కూడా వివరణ ఇచ్చారు. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నా. మీడియాలో వచ్చిన వార్తలు చూసి మా ఫ్యామిలీ మొత్తం నవ్వుకున్నాం. అతడెవడో నాలాగే ఉన్నాడు అని అందరూ నాకు ఫోన్లు చేశారు. వాళ్ళు పొరపాటుగా నేనే అని అనుకోవడంలో తప్పు లేదు అని అనిపించింది. ఎందుకంటే వాడెవడో నాలాగే ఉన్నాడు అని శ్రీకాంత్ వివరణ ఇచ్చారు.
అలాంటి వాడినే అయితే చిరంజీవి నన్ను ఎప్పుడో దూరం పెట్టేవారు
ఆ తర్వాత కూడా శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో తన గురించి వచ్చిన రూమర్స్ పై స్పందించారు. తనపై రూమర్స్ వచ్చిన మరుసటి రోజే చిరంజీవి గారి ఇంటికి వెళ్లినట్లు శ్రీకాంత్ తెలిపారు. ఫ్యామిలీ ఉన్నప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉండాలి అనే విషయం గురించి ఆయన నాతో మాట్లాడారు. ఆ తర్వాత నాపై వచ్చిన ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతూ.. నీ గురించి నాకు తెలుసు శ్రీకాంత్. నువ్వు అలాంటి పనులు చేయవు. వెంటనే వివరణ ఇచ్చి మంచి పని చేశావు అని అన్నారు.
శ్రీకాంత్ ఏంటి అనేది చిరంజీవి గారికి బాగా తెలుసు. ఒక వేళ నేను నిజంగానే అలాంటి పనులు చేసే వాడినే అయితే ఆయన నన్ను దగ్గరకి కూడా రానిచ్చేవారు కాదు. ఎప్పుడో మా బంధం తెగిపోయేది అని శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.