విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు పరశురామ్ లు ఈ షోలో పాల్గొని తమ సినిమాను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారట. అది కాకుండా ఈ శని, ఆదివారాలు రెండు రోజులు సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకోబోతున్నారు

బిగ్ బాస్ సీజన్ 2లో సినిమాను ప్రమోట్ చేయడం దర్శకనిర్మాతలకు కలిసొచ్చే పాయింట్. ఇప్పటివరకు చాలా సినిమాలు ఈ షోలో తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నాయి. తాజాగా గీత గోవిందం టీమ్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతుందని సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు పరశురామ్ లు ఈ షోలో పాల్గొని తమ సినిమాను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారట.

అది కాకుండా ఈ శని, ఆదివారాలు రెండు రోజులు సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకోబోతున్నారు. బన్నీ శనివారం ఈ టీమ్ కి పెద్ద పార్టీ ఇస్తుండగా, ఆదివారం చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పైగా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు కూడా లేకపోవడం వచ్చే వారం కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో తమ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకువెళ్లాలనేది చిత్రబృందం ప్లాన్. ఇదంతా చూస్తుంటే ఈ నెలాఖరు వరకు గీతగోవిందం తన జోరుని చూపించబోతుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్2: నూతన్ నాయుడు అవుట్.. హౌస్ మేట్స్ కి ఊహించని షాక్

'గీత గోవిందం' మూడు రోజుల కలెక్షన్స్.. షాక్ అవ్వాల్సిందే!