బిగ్ బాస్ సీజన్ 2 లో ఏదైనా జరగొచ్చు అనే క్యాప్షన్ కి తగ్గట్లుగానే హౌస్ లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి

బిగ్ బాస్ సీజన్ 2 లో ఏదైనా జరగొచ్చు అనే క్యాప్షన్ కి తగ్గట్లుగానే హౌస్ లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ లో రోల్ రైడా, కౌశల్ పోటీ పడ్డారు. టాస్క్ లో భాగంగా రోల్, కౌశల్ లు తమకిచ్చిన క్యూబ్స్ తో పిరమిడ్ ను నిర్మించాలి. ఈ క్రమంలో కౌశల్ కి సపోర్ట్ చేసే హౌస్ మేట్స్ రోల్ పిరమిడ్ నిర్మించకుండా బాల్స్ తో కొడుతూ అతడిని డిస్టర్బ్ చేయొచ్చు. అలానే రోల్ కి సపోర్ట్ చేసే హౌస్ మేట్స్ కౌశల్ ని ఇబ్బంది పెట్టొచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గేమ్ ఆడే సమయంలో నూతన్ నాయుడు.. కౌశల్ ని సపోర్ట్ చేస్తూ రోల్ పిరమిడ్ పై బాల్స్ విసురుతూ ఉన్నాడు. సడెన్ గా అతడి చేయి పని చేయకపోవడంతో కింద పడిపోయాడు. దీంతో డాక్టర్ వచ్చి అతడిని పరీక్షించి హ్యాండ్ డిస్లోకేట్ అయిందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం అతడిని హౌస్ నుండి బయటకి పంపాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్నే హౌస్ మేట్స్ అందరికీ వెల్లడించారు.

ఈరోజు ఎపిసోడ్ లో నూతన్ హౌస్ నుండి వెళ్లిపోయినట్లు ప్రకటించారు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో కౌశల్ కంటే రోల్ ఉత్తమ ప్రదర్శన కనబరచడంతో సంచాలకురాలిగా వ్యవహరించిన పూజా.. రోల్ పేరుని బిగ్ బాస్ కి తెలిపింది. ఈ వారం కెప్టెన్ గా రోల్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.