తెలుగు టెలివిజన్‌ సీరియల్స్‌ కూడా బడ్జెట్, కాన్సెప్ట్‌ల పరంగా సినిమాలతో పోటి పడుతున్నాయి. ఇప్పటికే కలర్‌ ఫుల్‌ రిచ్‌ బడ్జెట్‌తో సీరియల్స్‌ రూపొందిస్తుండగా తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ సీరియల్‌ బుల్లితెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. సౌత్‌ సినిమా ఎవర్‌ గ్రీన్‌ క్వీన్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఓ సోషియో ఫాంటసీ సీరియల్‌ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఈ సీరియల్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.

నాగభైరవి పేరుతో రూపొందుతున్న ఈ సీరియల్‌ ప్రోమోలో ఓ భారీ శివాలయంలో రమ్యకృష్ణ శివ పూజ చేస్తూ కనిపించింది. ఆ సమయంలో అష్టనాగు ఆమె భవిష్యత్‌ తరాలకు సంబంధించి ఓ విషయం చెబుతుంది. ఈ సీరియల్‌లో టైటిల్ రోల్‌లో యాష్మి గౌడ నటించగా హీరో నాగార్జున పాత్రలో ముద్ద మందారం ఫేం పవన్‌ సాయి నటించాడు. గుండమ్మ కథ ఫేం కల్కీ రాజా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

నాగభైరవి జానపద, ఫాంటసీ కథాంశాల కలయికలో విజువల్‌ వండర్‌గా తెరకెక్కించాడు. ఈ సీరియల్‌ను భారీ గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్నారు. బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ ఏ స్థాయి ఇమేజ్ సాధించిందో.. నాగ భైరవితో బుల్లితెర మీద అదే స్థాయి ఇమేజ్‌ సొంతం చేసుకుంటుందంటున్నారు ఫ్యాన్స్.