Asianet News TeluguAsianet News Telugu

దీపిక అర్థ నగ్న ఫోటో షూట్ పై సంజయ్ లీలా భన్సాలీ ఫైర్

  • బాలీవుడ్ లోనే కాక హాలీవుడ్లోనూ సత్తా చాటిన దీపికా పడుకొనే
  • దీపిక తాజాగా చేసిన హాట్ ఫోటో షూట్ పై సోషల్ మీడియాలో హంగామా
  • దీపిక ఫోటోలపై పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అభ్యంతరం
director sanjay leela bhansali unhappy with deepika padukone half nude photo shoots

పింక్ బ్యూటీ దీపికా పదుకొనే కెరీర్ టాప్ గేర్‌లో ఉంది. బాక్సాఫీస్ వద్ద ఆమె నటించిన చిత్రాలు కనకవర్షం కురిపిస్తున్నాయి. హలీవుడ్‌లో కూడా ఆమె కెరీర్ గ్రాండ్ గానే ప్రారంభమైంది. ఆమె నటించిన ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ ఘన విజయం సాధించింది. వసూళ్ల పరంగా మంచి రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలో ట్రిపుల్ ఎక్స్ 4‌లో కూడా దీపిక పదుకొనే నటిస్తుందని డైరెక్టర్ డీజే కారుసో ఇటీవల ప్రకటించడం హాలీవుడ్‌లో దీపిక హవాను చెప్పకనే చెప్పింది.

 

ఇలా బాలీవుడ్ లోనే కాక హాలీవుడ్‌లోనూ హవా కొనసాగుతున్న తరణంలో ఇటీవల దీపిక పదుకొనే చేసిన ఫొటోషూట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు విమర్శించినా.. మరి కొందరు దీపిక గ్లామర్ అదుర్స్ అంటూ పండుగ చేసుకున్నారు. అయితే ఆమె ధరించిన దుస్తుల తీరు మాత్రం వివాదాస్పదమైంది.

 

ఇదిలా ఉండగా, దీపిక తీరు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని మనస్తాపానికి గురిచేసిందట. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పద్మావతి చిత్రంపై దీపిక చేసిన ఫోటోషూట్ ప్రతికూల ప్రభావం పడుతుందా అని సంజయ్ వాపోయారట. ఎందుకంటే పద్మావతి చిత్రంలో దీపికది అత్యంత సాంప్రదాయరీతిలో సాగే పాత్ర. అలాంటి నేపథ్యంలో ఇలా అర్ధనగ్న దుస్తుల్లో దీపిక కనిపించడం వల్ల సినిమాపై ప్రభావం పడుతుందేమో అనే భయం ఆయనను వెంటాడుతోంది.

 

ఇప్పటికే పద్మావతి చిత్రం అనేక వివాదాల్లో చిక్కుకుంది. చరిత్రను వక్రీకరించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారంటూ.. కొన్ని హిందూత్వ సంస్థలు రాజస్థాన్‌లోని షూటింగ్ స్పాట్‌పై దాడి చేశారు. డైరెక్టర్ భన్సాలీని కూడా గాయపర్చడం ఆ మధ్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

 

ఇలాంటి వివాదాల నడుమ దీపిక ఇలా చేస్తోందేంట్రా బాబో అని సంజయ్ లీలా భన్సాలీ మనస్తాపానికి గురయ్యాడట. పద్మావతి చిత్రంలో రాణి పాత్రలో కనిపించే దీపిక అర్థనగ్నంగా కనిపిస్తే ప్రజలు తప్పుగా ఆలోచించే ప్రమాదముందని, రాణి పాత్రలో ఉండే రాజసం దిగజారే ముప్పు ఉంటుందనే భయాన్ని భన్సాలి వ్యక్తం చేసినట్టు సమాచారం.

 

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపిక పదుకొనే నటించడం ఇది మూడోసారి. గతంలో రామ్ లీలా, బాజీరావ్ మస్తాని చిత్రాల్లో నటించింది. తాజాగా పద్మావతి చిత్రంలో రాణి పాత్రలో నటిస్తోంది. రణ్‌వీర్ సింగ్, షాహీద్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios