టాలీవుడ్ దర్శకుడు మారుతీ ఓ జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ రాణి కావడం కంటే తల్లి కావడమే ఓ ఆడదానికి గొప్పని చెప్పారు. విషయంలోకి వెళితే...క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం విరాట్ మరియు అనుష్క సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనితో కోట్లాదిగా ఉన్న వీరిద్దరి అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
 
కాగా నిన్న అనుష్క శర్మ మరో పోస్ట్ పంచుకున్నారు. తల్లి కావడం కంటే గొప్ప అనుభూతి ఏముంటుందని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో పెట్టారు. ఈ పోస్టుపై మహిళా జర్నలిస్ట్ మీనా దాస్ నారాయణ్ వ్యంగ్యంగా స్పందించారు. 'విరాట్ మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశారు, ఇంగ్లాండ్ మహారాణిని కాదు. కొంచెం గాల్లో తేలడం ఆపండి అని కామెంట్ పెట్టారు. 

సదరు మహిళా  జర్నలిస్ట్ కామెంట్ పై దర్శకుడు మారుతి ఫైర్ అయ్యారు. ఒక ఆడదానికి తల్లి కావడం కంటే ఏది ఎక్కువ కాదు, ఇంగ్లాండ్ మహారాణి కావడం కంటే తల్లి కావడమే ఓ ఆడదానికి సంతోషం ఇస్తుందని కౌంటర్ వేశాడు. మహిళ అందులోను జర్నలిస్ట్ అయ్యి ఉండి ఇలాంటి కామెంట్ పెట్టడం దారుణం అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.