బిగ్ బాస్2 విజేత అతడే.. దర్శకుడు మారుతి కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 28, Aug 2018, 10:49 AM IST
director maruthi about bigg boss title winner
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. హౌస్ లో మసాలా రోజురోజుకి ఎక్కువవుతుండడంతో షోపై ఆసక్తి పెరిగిపోతోంది. ఈ షోపై సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2 కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. హౌస్ లో మసాలా రోజురోజుకి ఎక్కువవుతుండడంతో షోపై ఆసక్తి పెరిగిపోతోంది. ఈ షోపై సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. ఇటీవల యాంకర్ రష్మి బిగ్ బాస్ విజేత కౌశల్ కాకపోతే ధర్నాలు జరుగుతాయని కామెంట్స్ చేసింది. కోన వెంకట్ ఫేస్ బుక్ లైవ్ లో కౌశల్ ఆర్మీ గురించి మాట్లాడారు. తాజాగా దర్శకుడు మారుతి సైతం కౌశల్ కి సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

'బిగ్ బాస్ 2 తెలుగు లేటెస్ట్ ఎపిసోడ్ చూశాను. కౌశల్ ప్రెజెన్స్ చాలా ఆకట్టుకుంటోంది. కౌశల్ ఆర్మీ పేరుతో ఆయన చాలా ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం చూస్తుంటే బాగా అనిపిస్తోంది. ఈ సీజన్ విన్నర్ అతడే అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్' అని ట్వీట్ చేశారు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఎంతగా పెరిగిందంటే అతడికి హౌస్ లో వ్యతిరేకంగా ఉన్న హౌస్ మేట్స్ ని ఎలిమినేషన్ ద్వారా బయటకి పంపించడంలో కౌశల్ ఆర్మీ కీలకపాత్ర పోషిస్తోంది.

అయితే హౌస్ మేట్స్ మాత్రం నామినేషన్ ప్రాసెస్ లో కౌశల్ ని నామినేట్ చేస్తూనే ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో కూడా కౌశల్ ఉన్నాడు. అతడిని కాపాడడానికి ఎలాగో కౌశల్ ఆర్మీ ఉంది కాబట్టి నామినేషన్స్ ఉన్న వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో.. ఈ వారం కూడా కౌశల్ సేఫ్ అన్నమాట! 

 

 ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్ హోస్ట్ గా నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. నాని కామెంట్స్!

బిగ్ బాస్2: తనీష్ ని కావాలనే సేవ్ చేస్తున్నారా..?

loader