ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న నటించిన మూవీ 'కుబేర'.చిత్ర యూనిట్ కుబేర చిత్రానికి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తోందని అంటున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు.
కుబేర మూవీ
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న నటించిన మూవీ 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ముఖ్యంగా ధనుష్, నాగార్జున, రష్మిక నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. చిత్ర యూనిట్ కుబేర చిత్రానికి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తోందని అంటున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
సక్సెస్ మీట్ లో ధనుష్ స్పీచ్
సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ లో హీరో ధనుష్ మాట్లాడుతూ .. అందరికి నమస్కారం ఇది. ఒక అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు కోసమే ప్రతి ఆర్టిస్ట్ ఎదురుచూస్తారు. ఇలాంటి రోజుల్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక సినిమాకి యునానిమస్ గా అద్భుతమైన రెస్పాన్స్ రావడం అనేది చాలా అరుదు. అది ఈ సినిమాకి జరిగింది. ఈ విషయంలో మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ దేవుడిచ్చిన సక్సెస్ గా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సినిమాని గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు అభిమానులకు ధన్యవాదాలు.
ఇటీవల కాలంలో థియేట్రికల్ రన్ అనేది చాలా కష్టంగా మారిపోయింది. జనాలు థియేటర్స్ కి రావడం లేదు. భారీ యాక్షన్ పాన్ ఇండియా చిత్రాలు, రక్తపాతం సృష్టించే ఫైట్స్,గ్రాండ్ విజువల్స్, భారీ హంగులు ఉన్న చిత్రాలనే జనాలు థియేటర్స్ లో చూడడానికి ఇష్టపడుతున్నారనే అభిప్రాయం నెమ్మదిగా పెరుగుతోంది. కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కొత్త నమ్మకాన్ని ఇచ్చారు. హార్ట్ ఫుల్ గా సినిమా తీస్తే ఆడియన్స్ ని ధియేటర్స్ కి తీసుకురావచ్చు అనే హోప్ ని ఆయన ఇచ్చారు. ఎమోషన్ అనేది బిగ్గెస్ట్ గ్రాండియర్. హ్యూమన్ ఎమోషన్స్ కంటే పెద్ద గ్రాండియర్ ఏది ఉండదు. తమిళ్ లో ఈ సినిమా చాలా అద్భుతంగా ఆడుతోంది. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది. ముందు నిర్మాత మొహంలో ఆనందం చూసి సినిమా ఎంత సక్సెస్ అయిందో చెప్పొచ్చు అని మా నాన్న చెప్పేవారు. మా నిర్మాతలు ఆనందంగా ఉండడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చిరంజీవి గారు వచ్చి మా టీం కి బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది మెగా సక్సెస్. చిరంజీవి గారు నాగార్జున గారి సమక్షంలో మాట్లాడడం అనేది ఒక గొప్ప బ్లెస్సింగ్ భావిస్తున్నాను. సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లి ఆడియన్స్ కి చేరువ చేసిన మీడియాకి థాంక్యూ. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అని ధనుష్ అన్నారు.
పాన్ ఇండియా చిత్రాలపై ధనుష్ సెటైర్లు
ఈ ఈవెంట్ లో ధనుష్ పాన్ ఇండియా చిత్రాల గురించి మాట్లాడిన విధానం సరికొత్త చర్చకు దారితీసింది. చిన్న, మీడియం బడ్జెట్ తరహా చిత్రాలని థియేటర్స్ లో చూడడానికి ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపడం లేదు. సినిమా రిలీజైన కొన్ని వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీనితో ఓటీటీలో చూసేద్దాం అనుకుంటున్నారు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా స్థాయిలో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించిన చిత్రాలని మాత్రమే థియేటర్స్ లో చూడడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
కానీ ఈ విషయంలో ధనుష్ వాదన వేరే విధంగా ఉందని కుబేర సక్సెస్ మీట్ లో అర్థం అయింది. ఈ సందర్భంగా ధనుష్ పాన్ ఇండియా చిత్రాలపై సుతిమెత్తగా సెటైర్లు వేస్తూ.. జనాలు థియేటర్స్ కి రావడానికి గ్రాండ్ విజువల్స్ ఉన్న పాన్ ఇండియా సినిమాలే అవసరం లేదు.. శేఖర్ కమ్ముల లాగా మనసు పెట్టి వైవిధ్యమైన కథని అందిస్తే చాలు అనేలా ధనుష్ కామెంట్స్ చేశారు.
