Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ కు షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్డ్, ఆదిపురుష్ టీమ్ కు నోటీసులు

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభాస్ తో పాటు మూవీ టీమ్ కు  సోమ‌వారం నోటీసులు జారీ చేసింది.  ఆది పురుష్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ విషయం పొలిటిక్ లర్న్ తీసుకుంది. 
 

Delhi High court order Issues Notices to prabhas
Author
First Published Oct 11, 2022, 8:02 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్.బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్  రాముడి పాత్ర‌లో  న‌టిస్తున్నాడు. ఈమూవీ నుంచి రీసెంట్ గా  టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ టీజ‌ర్‌ తో పాటు.. టీజర్ లో ప్రభాస్ లుక్  వివాదంగా మారింది. ఈ టీజర్ పై పలు వర్గాల నుంచి  అభ్యంత‌రం వ్యక్తం అవుతుంది. 

ఈక్ర‌మంలో ఆదిపురుష్ సినిమాలో హిందువుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచారంటూ.. కొన్నిరాష్ట్రాల్లో నిరసనలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషయంలో  ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఆదిపురుష్' సినిమా విడుద‌ల‌ను ఆపేయాలని. ఈ విధంగా సినిమాపై పై స్టే విధించాల‌ని ఆ సంస్థ కోర్డ్ ను కోరింది.  ఇక ఈ  పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్ర‌భాస్‌కు నోటీసులు జారీ చేసింది. ప్ర‌భాస్‌తో పాటు ఆదిపురుష్ మూవీ టీమ్ కు కూడా కోర్డ్ నోటీసులు జారీ చేసింది. 

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచీ చాలా విమర్షలు ఎదుర్కొంటున్నారు టీమ్. ముఖ్కంగా రాముడిగా ప్రభాస్ లుక్ తో పాటు.. టీజర్ గ్రాఫిక్స్ పై కూడా రకరకాలు విమర్షలు మొదలయ్యాయి. ఈ విషయం రాజకీయ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్న టైమ్ లో కోర్ట్ లలో రకరకాల కేసులు వేస్తున్నారు. రామయాణంలోని పాత్రలను ‘ఆదిపురుష్’లో సరిగ్గా చూపించడం లేదని, హిందూ దేవుళ్లను కించపరిచేలా సినిమాను రూపొందిస్తున్నారని పలువురు బ్రహ్మాణులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాముడిని, రావణాసురుడిని, సీతమ్మను, హన్మంతుడిని చూపించిన తీరుపై మండిపడుతున్నారు.  ఇప్పటికే యూపీ,  పంజాబ్, తదితర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఓ న్యాయవాది కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. 

మరోవైపు హిందూ దేవుళ్లను మరియు దేవతలను బాలీవుడ్ సినిమాల్లో సరిగా చూపించడం లేదని ఆరోపిస్తూ సనాతన్ సెన్సార్ బోర్డ్‌ ను ఏర్పాటు చేయాలని హిందూ దార్శనికుల సంఘం అఖిల భారతీయ సంత్ సమితి ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ అంశంపై బ్రాహ్మణులు గట్టిగానే పోరాడుతున్నారు.  ఈ క్రమంలో  రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచార్యవాస్ కూడా స్పందించడం ఆదిపురుష్ టీజర్ వివాదం మరింతగా ముదురుతోంది.  

 
 

Follow Us:
Download App:
  • android
  • ios