న్యూ ఇయర్ వేళ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. ఆమె అలా చేయడానికి కారణం ఏమిటో తెలియక ఫ్యాన్స్ సైతం జుట్టు పట్టుకుంటున్నారు. దీపికా పదుకొనె తాను సోషల్ మీడియాలోకి ప్రవేశించిన నాటి నుండి చేసిన అన్ని పోస్ట్స్ డిలేట్ చేసింది. తన ఫొటోలతో పాటు పాత జ్ఞాపకాలన్నీ చెరిపివేసింది. ఒక్క పోస్ట్ కూడా లేకుండా దీపికా పదుకొనె ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ ని ఖాళీ చేశారు. 

ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో మిలియన్స్ కొద్దీ ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి దీపికా పదుకొనె తన పోస్ట్స్ అన్నింటినీ ఎందుకు డిలేట్ చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు . దీపికా వింత ప్రవర్తనకు ఫ్యాన్స్ ఒకింత ఆందోళన గురయ్యారు. కొందరు దీపికా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయేమోనని అనుకున్నారు. ఐతే దీపికా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని తెలుస్తుంది. 


ఇక నేడు దీపికా న్యూ ఇయర్ విషెష్ చెవుతూ ఒక పోస్ట్ చేయగా, అది మాత్రమే ఆమె అకౌంట్స్ లో ఉంది. ఇక దీపికా ప్రస్తుతం భర్త రణ్వీర్ సింగ్ నటిస్తున్న 83 మూవీతో పాటు మరి కొన్ని హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో ప్రభాస్ సరసన ఓ మూవీ కోసం ఆమె సైన్ చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ లో దీపికాకు ఇది మొదటి చిత్రం కావడం విశేషం.