Asianet News TeluguAsianet News Telugu

ప్రియదర్శి హీరోగా చేసిన వెబ్ సీరిస్ రిలీజ్ డేట్

కమిడియన్ ప్రియదర్శి లూసర్ నే సీరిస్ తో డిజిటల్  డెబ్యూ చేస్తున్నారు. ఇదే ప్రియదర్శి తొలి వెబ్ సీరిస్. ఇందులో ప్రియదర్శి రైఫిల్ షూటర్ గా కనిపిస్తారు. తన కలను నెరవేర్చుకోవటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అనే విషయం చుట్టూ ఈ వెబ్ సీరిస్ తిరగనుంది. 1980 నుంచి 2000 దాకా ఉండే మద్యకాలంలో  ఈ వెబ్ సీరిస్ జరగనుంది. ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వస్తుందని జీ5 సంస్ద భావిస్తోంది. 

Comedian Priyadarshi  DIGITAL Loser GETS A DATE
Author
Hyderabad, First Published Apr 28, 2020, 5:15 PM IST

ఇప్పుడు ఎక్కడ విన్నా కరోనా కబుర్లు లేదా వెబ్ సీరిస్ వార్తలే. ముఖ్యంగా టీవి సీరియల్స్, సినిమాలు షూటింగ్ లు ఆగిపోయిన ఈ సమయంలో జనమంతా వెబ్ సీరిస్ ల మీద పడ్డారు. ముఖ్యంగా లాక్ డౌన్ నేపధ్యంలో వెబ్ సీరిస్ లు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో మల్లేశం సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శి సైతం ఓ వెబ్ సీరిస్ తో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న లూసర్ అనే వెబ్ సీరిస్ అన్ని పనులు పూర్తి చేసుకుని స్ట్రీమింగ్ రెడీ అయ్యింది. మే 15 నుంచి జీ5లో ప్రారంభం కానుంది. 

కమిడియన్ ప్రియదర్శి ఈ సీరిస్ తో డిజిటల్  డెబ్యూ చేస్తున్నారు. ఇదే ప్రియదర్శి తొలి వెబ్ సీరిస్. ఇందులో ప్రియదర్శి రైఫిల్ షూటర్ గా కనిపిస్తారు. తన కలను నెరవేర్చుకోవటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అనే విషయం చుట్టూ ఈ వెబ్ సీరిస్ తిరగనుంది. 1980 నుంచి 2000 దాకా ఉండే మద్యకాలంలో  ఈ వెబ్ సీరిస్ జరగనుంది. ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వస్తుందని జీ5 సంస్ద భావిస్తోంది. 

లూసర్‌ ..ఒక స్పోర్ట్స్‌ డ్రామా. ఆటల్లోని రాజకీయాల వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలను ఎదురుకున్నారో అన్నది కథ. ఇందులో ప్రియదర్శి, కల్పిక, షియాజి షిండే, శశాంక్‌ ముఖ్య పాత్రలలో నటించారు. లూసర్‌కు అభిలాష్‌ రెడీ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ వారు దీన్ని నిర్మించారు. 

దేశవ్యాప్తంగా వివిధ భాషలలో అధిక వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న జీ5 . జీ5 గతంలో విడుదల చేసిన గాడ్,హై ప్రిస్టిస్, కైలాసపురం,Mrs.సుబ్బలక్ష్మి,నర్డ్,హవాలా, బీటెక్,ఎక్కడికి ఈ పరుగు, వాట్సాప్ పనిమనిషి , చిత్ర విచిత్రం ,నాన్న కూచి వంటి వినూత్నమైన వెబ్ సిరీస్ లను ఆదరించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios