బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకి చేరుకుంది. 16 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరొకరు జాయిన్ అయ్యారు. ఇంతమందితో మొదలైన షోలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు.

ఏడుగురు కూడా టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో కౌశల్, గీతామాధురి, దీప్తి. రోల్ రైడా, అమిత్ లు ఉండగా వీరిలో ఇద్దరు హౌస్ ని వీడే అవకాశం కనిపిస్తుంది. ఈ వారం హౌస్ లో డబులు ఎలిమినేషన్ ఉండే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఆదరణ ఇప్పటివరకు నమోదైన ఓట్ల ప్రకారం ముందుగా కౌశల్ టాప్ ప్లేస్ లో ఉన్నారు.

ఆ తరువాత దీప్తికి ఎక్కువ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. తరువాత స్థానంలో గీతా ఉండగా.. అమిత్, రోల్ కి తక్కువ ఓట్లు వస్తున్నట్లు సమాచారం. రోల్, అమిత్ లు ఈసారి గట్టెక్కడం కష్టమని అంటున్నారు. మొదటినుండి సేఫ్ గేమ్ ఆడుతున్న రోల్ ఎలిమినేషన్స్ నుండి తప్పించుకుంటూ వస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం రోల్ నామినేషన్స్ లో ఉండడంతో అతడు ఎలిమినేట్ అవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.