బిగ్ బాస్ సీజన్ 2 నిన్నటి ఎపిసోడ్ లో పూర్తి ఎమోషనల్ టచ్ ఇచ్చారు బిగ్ బాస్. మూడు నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటోన్న కంటెస్టెంట్స్ కోసం వారి కుటుంబ సభ్యులని హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్. ముందుగా సామ్రాట్ తల్లి హౌస్ లోకి వెళ్లింది. ఆమె వచ్చేసరికి ఫ్రీజ్ లో ఉన్న సామ్రాట్ తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఫ్రీజ్ నుండి బయటకి వచ్చి తన తల్లిని హత్తుకున్నాడు.

అనంతరం తన తల్లితో పెర్సనల్ గా మాట్లాడాడు సామ్రాట్. ఈ క్రమంలో ఆమె సామ్రాట్ తో.. 'నా కొడుకు మంచోడు అని ప్రతిఒక్కరికి  చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా బిగ్ బాస్ చేశారు. నువ్ టైటిల్ గెలవకకపోయినా పర్వాలేదు.. ఇక్కడవరకు రావడమే గొప్ప విషయం. ఒక వేళ గెలిచినా అది నీకు బోనస్ లాంటిదని అన్నారు. అమిత్ కోసం తన కొడుకు, భార్య వచ్చారు. వాళ్లని చూసి అమిత్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు.

ఈ ప్రపంచంలో కుటుంబం కంటే ఏది ముఖ్యం కాదని తోటి హౌస్ మేట్స్ తో చెప్పాడు. దీప్తి కోసం తన కొడుకు, భర్త రాగా.. ఇంతకాలానికి తన కొడుకుని చూసుకొని భావోద్వేగంతో తల్లడిల్లిపోయింది దీప్తి. తన భర్త చెప్పిన సలహాలను విని నమ్మకంతో గేమ్ ఆడతానని చెప్పింది. ఇక దీప్తి భర్త వెళ్లిపోతూ తనీష్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఫిజికల్ గా కొంచెం చూసుకొని గేమ్ ఆడండి అంటూ తనీష్ కి చెప్పారు.

కారు టాస్క్ లో తనీష్.. దీప్తితో ప్రవర్తించిన తీరుపై పరోక్షంగా స్పందించారు దీప్తి భర్త. ఈ విషయంపై హర్ట్ అయిన తనీష్.. సిగరెట్ రూమ్ లో కూర్చొని అదే విషయాన్ని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో సామ్రాట్ అతడిని ఓదారుస్తూ.. భర్త కాబట్టి భార్య మీద ఆ మాత్రం జాగ్రత్త ఉంటుంది కదా..? అయినా ఆయనేం అన్నారని..? చూసి ఆడమన్నారు అంతే కదా దానికి ఎందుకు బాధ పడుతున్నావంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు.