బిగ్ బాస్2: ఆ నలుగురిలో వెళ్లేదెవరు..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 4, Sep 2018, 10:44 AM IST
bigg boss2: nominations for elimination
Highlights

బిగ్ బాస్ సీజన్2 ఆఖరి దశకు చేరుకోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కీలకంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ లో నలుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు పోటీ పడబోతున్నారు. 

బిగ్ బాస్ సీజన్2 ఆఖరి దశకు చేరుకోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కీలకంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ లో నలుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు పోటీ పడబోతున్నారు. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో.. ముందుగా మర్డర్ టాస్క్ లో భామగా కౌశల్ ఈసీజన్ మొత్తం నామినేట్ కావడంతో అతడ్ని ఈ వారం నామినేట్ చేయకుండానే ఎలిమినేషన్ లో ఉంచారు. గీతామాధురి, తనీష్, రోల్ రైడాలకు నామినేషన్స్ నుండి మినహాయింపు లభించింది.

హౌస్ లో మిగిలిన సభ్యులు ఒక్కొక్కరు ముగ్గుర్ని ఎలిమినేషన్ కి నామినేట్ చేస్తూ ఒకర్ని సేవ్ చేయమని బిగ్ బాస్ చెప్పారు. ఈ ప్రాసెస్ లో ఎక్కువమంది అమిత్, శ్యామల, దీప్తిలను నామినేట్ చేయడంతో ఈ ముగ్గురితో పాటు కౌశల్ కూడా నామినేషన్ ను ఎదుర్కోనున్నారు. వీరి నలుగురిలో ఎవరు బయటకి వెళ్లబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.

కౌశల్ కి కౌశల్ ఆర్మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ వారం కూడా అయన సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ లో దీప్తికి, శ్యామలకి ప్రేక్షకుల్లో కాస్త ఫాలోయింగ్ ఏర్పడింది కాబట్టి ఈ వారం అమిత్ బయటకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి గతవారమే అమిత్ కి తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఆయన్ని ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ కావాలనే నూతన్ ని బయటకి పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే ఈసారి నామినేషన్స్ లో ఆయన ఎలిమినేట్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే గనుక దీప్తి, శ్యామలలో శ్యామల వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్ షోపై నటి మాధవీలత ఫైర్!

బిగ్ బాస్2: ఎలిమినేషన్ ట్విస్ట్.. నూతన్ ఔట్!

బిగ్ బాస్2: నూతన్ నాయుడు ఎలిమినేట్ కానున్నాడా..?

బిగ్ బాస్2: సామాన్యుడు గణేష్ ఔట్!

loader