బిగ్ బాస్2: గ్రూపులు కట్టడం మాని కెప్టెన్సీ నేర్చుకో.. బాబు ఫైర్

First Published 26, Jul 2018, 11:34 PM IST
bigg boss2: babu gogineni fires on geetha madhuri
Highlights

 'గ్రూపులు కట్టడం మానేసి కెప్టెన్సీ ఎలా చేయాలో నేర్చుకో' అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. అప్పటికీ తన సహనాన్ని కోల్పోకుండా గీతా అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా .. మరిన్ని మాటలు అంటూ గీతపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు బాబు. 

బిగ్ బాస్ సీజన్ 2 లో 47వ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో భాగంగా ముందుగా పూజా రామచంద్రన్ కు ఒక టాస్క్ ఇచ్చి ఆమెను మెప్పించిన నలుగురి పేర్లు చెప్పమని అడగగా.. అమిత్, సామ్రాట్,గీతా మాధురి, దీప్తి నల్లమోతుల పేర్లు చెప్పింది పూజా. ఈ నలుగురు ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో పార్టిసిపేట్ చేయొచ్చని బిగ్ బాస్ చెప్పారు. ఈ క్రమంలో నలుగురు స్టాట్యూల మాదిరి అవతారమెత్తి టేబుల్ మీద నిలబడి ఉండాలి. చివరివరకు ఆ టేబుల్ మీద ఎవరు నిలబడి ఉంటారో వారే ఈ వారం కెప్టెన్సీ విజేతలు.

అందరికంటే చివరివరకు నిలబడి గీతామాధురి మరోసారి ఇంటి కెప్టెన్ అయ్యారు. అయితే టాస్క్ సమయంలో దీప్తి నల్లమోతుపై బాబు గోగినేని వెనుక నుండి నీళ్లు వేయడంతో ఆ ఫోర్స్ కు కిందకి దిగిపోయింది. ఆ విధంగా ఆమె కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయింది. ఆమె దగ్గరకు వెళ్లి టాస్క్ లో భాగంగా ఇలా చేశానని నాకు మీరే కెప్టెన్ అవ్వాలనుందని బాబు గోగినేని చెప్పారు. ఈ విషయాన్ని దీప్తి అక్కడితో వదిలేసింది. అయితే దీప్తి ఓడిపోవడానికి కారణం బాబు గోగినేని అని తనకు అనిపిస్తుందని గీతామాధురి.. రోల్ రైడా, గణేష్ ల వద్ద ప్రస్తవాయించింది.

ఆ సమయంలో అక్కడకి వచ్చిన బాబు గోగినేని ఆమెపై ఫైర్ అయ్యాడు. 'గ్రూపులు కట్టడం మానేసి కెప్టెన్సీ ఎలా చేయాలో నేర్చుకో' అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. అప్పటికీ తన సహనాన్ని కోల్పోకుండా గీతా అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా .. మరిన్ని మాటలు అంటూ గీతపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు బాబు. చివరకు నాకు ఈ విషయంపై మాట్లాడడం ఇష్టం లేదని గీతా చెబుతున్నా.. ఆయన వాదిస్తూనే ఉండడంతో.. 'నా గేమ్ నేను పెర్ఫెక్ట్ గా ఆడుతున్నా.. మీకు నచ్చకపోతే నామినేట్ చేసుకోండి.. లేదంటే కంప్లైంట్ చేసుకోండి.. ఏమైనా చేసుకోండి' అంటూ గీతా చెప్పింది.    

ఇది కూడా చదవండి..

బిగ్ బాస్2: మరో లవ్ స్టోరీ షురూ కానుందా..?

loader