బిగ్ బాస్2: మరో లవ్ స్టోరీ షురూ కానుందా..?

First Published 26, Jul 2018, 11:15 PM IST
bigg boss2: conversation between tanish and nandini
Highlights

తనీష్.. నందిని దగ్గరకు వెళ్లి.. 'నీతో మాట్లాడుతుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ఏదైనా మాట్లాడొచ్చనే ఫ్రీడమ్ ఉంటుంది' అని చెప్పగా.. నాకు నువ్వు బాగా నచ్చావ్ తనీష్ అంటూ అతడికి హగ్ చేసుకొని ముద్దు పెట్టింది నందిని.

మొదటి సీజన్ తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్2 లో మసాలా కాస్త ఎక్కువైందనే చెప్పాలి. మొదట అందరూ కలివిడిగా కనిపించినా.. మెల్లమెల్లగా గ్రూప్ గ్రూపులుగా విడిపోయారు. ఇందులో సామ్రాట్-తేజస్వి, తనీష్-దీప్తి సునైనాలు జంటలుగా కనిపించేవారు. వారి మధ్య జరిగే సంభాషణలు కూడా అలానే ఉండడంతో ఆడియన్స్ లో పలు సందేహాలు కలిగాయి. తేజస్వి బయటకి వెళ్లిపోవడంతో సామ్రాట్ తన ఆట ఆడుకుంటూ బిజీ అయిపోయాడు.

ఇక తనీష్, సునైనాను ముద్దు చేస్తూనే ఉన్నాడు. అయితే తనీష్.. నందినితో మాట్లాడే తీరు, ప్రవర్తన చూస్తుంటే ఆమె పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే సందేహం కలుగకమానదు. గతంలో నందినికి కూడా ఓ సందర్భంలో తనీష్ తనకు నచ్చాడని దీప్తి ముందు చెప్పింది. తనీష్ కూడా నందినితో మాట్లాడడం నచ్చుతుందని అన్నారు. అయితే ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో తనీష్.. నందిని దగ్గరకు వెళ్లి.. 'నీతో మాట్లాడుతుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ఏదైనా మాట్లాడొచ్చనే ఫ్రీడమ్ ఉంటుంది' అని చెప్పగా.. నాకు నువ్వు బాగా నచ్చావ్ తనీష్ అంటూ అతడికి హగ్ చేసుకొని ముద్దు పెట్టింది నందిని.

దీంతో హౌస్ లో మరో ప్రేమకథ ఏమైనా షురూ అయిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి రాను రాను ఎపిసోడ్స్ లో వీరు ఎలా ఉంటారో చూడాలి!

loader