ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. త్వరలో బిగ్ బాస్ సరికొత్త సొగబులద్దుకుని ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 

తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పటిలాగే ఆసక్తిని రేపుతూ, అంతకు మించిన కంటెంట్ తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ కాబోతోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రిలీజ్ అయ్యింది. ఈ మేరకు బిగ్ బాస్ టీమ్ తాజా ప్రోమోను విడుదల చేశారు. ఈ సారి కూడా నాగార్జున హోస్ట్ గా కనిపించబోతున్నారు.

ఈ ప్రోమోలో హోస్ట్ గా అక్కినేని నాగార్జున సరికొత్తగా కనిపించారు. ఈసారి సీజన్ మరింత ఉత్కంఠభరితంగా సాగబోతుందని సంకేతాలిచ్చారు. అంతే కాదు ఈసారి కంటెంట్ ఎలా ఉండబోతుందనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. సీజన్ 9 కు ఈసారి చదరంగం కాదు.. రణరంగమే అనే ట్యాగ్‌లైన్‌ను యూస్ చేయబోతున్నారు. దాంతో ఈసారి పోటీ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నట్టు అర్ధం అవుతుంది. అంతే కాదు ఈసారి కంటెస్టెంట్ల మధ్య పోరు నిజమైన యుద్ధ రంగాన్ని తలపించేలా ఉండబోతుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

బిగ్‌బాస్ షోకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఈ షో కోసం ఎదురుచూస్తూ, ప్రతి ఎపిసోడ్‌ను ఆసక్తిగా గమనిస్తుంటారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే ఈ సీజన్ అంతకు మించి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఆడియన్స్ ను ఇంకా ఎక్కువగా ఆకట్టుకునేలా కంటెంట్ ఉండబోతున్నట్టు స్పష్టమవుతోంది.

ప్రోమోలో నాగార్జున చాలా పవర్ ఫుల్ గా కనిపించారు. ఈసారి ఇంకాస్త స్ట్రిక్ట్ గా షోను నడిపించేలా ఆయన బాడీ లాగ్వేజ్ కనిపనించింది. అంతే కాదు తన మార్క్ లో "ఈసారి చదరంగం కాదు.. రణరంగమే" అంటూ చెప్పడం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పై అంచనాలు మరింతగా పెంచేసింది. నాగార్జున ఇప్పటికే గత సీజన్లలో బిగ్‌బాస్ హోస్ట్‌గా తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. వీకెండ్ ఎపిసోడ్లలో తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నాగార్జున మార్క్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మరోసారి ఆయన హోస్ట్‌గా కొనసాగబోతున్నారు.\

YouTube video player

ఇప్పటికే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రేక్షకులు ఈ ప్రోమోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు, బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరగబోతుంది, అనే ప్రశ్నలు నెటిజన్లను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. అయితే గత సీజన్లకంటే ఈసారి ముందుగానే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే.. నెక్ట్స్ మన్త్ ఈ షో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకు షో ప్రారంభ తేదీపై అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ, ప్రోమో విడుదలతో బిగ్‌బాస్ సందడి మొదలైంది. త్వరలోనే షోకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్లు అనే దానిపై భారీ స్థాయిలో ఊహాగానాలు మొదలయ్యాయి. సినీ, టీవీ రంగాల్లో నుంచి పలువురు ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ పోటీ మరింత ఎక్కువగా ఉండబోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. షో ఫార్మాట్‌లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి వ్యూహాలు మరింత పదునుతో ఉండబోతున్నట్టు సమాచారం. ఇక మిగతా వివరాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. సీజన్ 9లో ఎవరు పాల్గొనబోతున్నారు. ఎవరు విన్ అవుతారు, అనేది చూడాలి.