MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 40 లక్షలు ఖర్చుపెట్టి యాక్టర్ ను బ్రతికించిన చిరంజీవి, మరోసారి అస్వస్థతకు గురైన నటుడు

40 లక్షలు ఖర్చుపెట్టి యాక్టర్ ను బ్రతికించిన చిరంజీవి, మరోసారి అస్వస్థతకు గురైన నటుడు

రెండు కిడ్నీలు పాడైపోవడంతో చావుబ్రతుకుల్లో ఉన్న స్టార్ నటుడిని, మెగాస్టార్ చిరంజీవి గతంలో ఆదుకున్నారు. దాదాపు 40 లక్షలతో వైద్యం చేయించారు మెగాస్టార్. కాని ఆ నటుడు మళ్లీ అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అయినట్టు తెలుస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jun 26 2025, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Asianet News

ఇండస్ట్రీలో పరిచయం ఉన్న నటులు ఎవరైనా ఆర్థికంగా సాయం చేయాలంటే ఏ పదివేలో లేక 50 వేలో చేస్తుంటారు. మరీ హాస్పిటల్ లో ఉన్నారంటే లక్ష, రెండు లక్షలు సాయం చేసేవారు ఉంటారు. కాని ఓ స్టార్ నటుడు ప్రాణాపాయంల ఉన్నాడని తెలిసి మెగాస్టార్ చిరంజీవి దాదాపు 40 లక్షల విలువైన ట్రీట్మెంట్ ను చేయించి అతన్ని బ్రతికించాడు. ఆ నటుడు ఎవరనో కాదు పొన్నంబళం. కాని ఆయన మరోసారి అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలు అయ్యారు. ఇంతకీ తమిళ నటుడికి ఏమయ్యింది.?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : Google

నటుడు పొన్నంబళం గుర్తుండే ఉంటాడు.. విలన్ గా ఆయన పెర్ఫామెన్స్ కు భయపడి దగ్గరకు కూడా వెళ్లేవారుకాదు జనాలు. పొన్నంబళం చిన్నప్పటి నుంచి కోలీవుడ్ ప్రపంచంలో స్టంట్ మ్యాన్‌గా పనిచేసి ఆ తర్వాత పెద్ద విలన్‌గా మారారు.1988లో విడుదలైన "కలియుగం" సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ హిందీ సినిమాల్లో కూడా నటించాడు.

Related Articles

Related image1
60 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
Related image2
శ్రీకాంత్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
36
Image Credit : Google

తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విలన్‌గా, స్టంట్ మ్యాన్‌గా నటించిన పొన్నంబళం 35 ఏళ్లకు పైగా ఈ రంగంలో ఉన్నాడు. అయితే ఆయనకు కు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో పాటు.. ఆరోగ్యం దెబ్బతినడంతో బాగా ఇబ్బందులు పడ్డాడు. అన్ని సినిమాలు చేసినా.. ఆయన తీవ్ర పేదరికంలో కూరుకుపోవడంతో వైద్య ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యం క్షీణించడంతో.. ఆయన పలువురి సహాయం అడిగాడట.

46
Image Credit : Asianet News

ఆయనకు తమిళ పరిశ్రమ కంటే కూడా తెలుగు స్టార్ హీరో నుంచే అతిపెద్ద సాయం అందడం విశేషం. అది కూడా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పొన్నంబళం కు సాయం చేశారట. ఈ విషయాన్ని ఎన్నోసార్లు గుర్తు చేశారు పొన్నంబళం. తన ప్రాణాలు కాపాడి తన దైవంలా మారారు మెగాస్టార్ అంటూ తమిళ నటుడుపొన్నంబళం అంటున్నారు. చిరంజీవి వల్లే తాను ప్రాణాలతో ఉన్నానన్నారు.

56
Image Credit : our own

తనను అన్నా వదినలు విషం పెట్టి చంపాలని చూశారు.. కిడ్నీలు రెండు పాడైపోయి.. మంచాన పడటంతో తన పని అయిపోయింది అనుకున్నాడట పొన్నం. ఎవరు సాయానికి ముందుకు రాకపోవడంతో ఆశలు వదలుకున్నారు. చివరి ప్రయత్నంగా మెగాస్టార్ చిరంజీవికి వేడుకున్నాడు తమిళ నటడు. ఇక వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న పొన్నంబళంకు కావల్సిన సాయం చేశారట.

66
Image Credit : Google

అయితే అందరిలాగే లక్ష రెండు లక్షలు ఇచ్చి వదిలేస్తారు అనుకున్నాను కాని ఆయన ఏకంగా ఆసుపత్రి ఖర్చులన్నీ పెట్టుకున్నారు. నాకు కిడ్నీ ప్రాబ్లమ్ రావడంతో అపోలోలో నాకు ట్రీట్మెంట్ చేశారు. దాని కోసం ఆయన దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు పొన్నంబళం. తాను కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఉన్నపుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న కొందరు డయాలసిస్‌ కోసం మాత్రమే సాయం చేశారని చెప్పారు. 

అయితే లాస్ట్ ఇయర్ కోలుకుని హాస్పిటల్ కు చేరుకున్న పొన్నంబళం ..తాజాగా, మళ్లీ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు వస్తుండటం ఆయన ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. అయితే ఈసారి ఏమైందన్న విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Related Stories
Recommended image1
60 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
Recommended image2
శ్రీకాంత్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved