60 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో 60 ఏళ్లు స్టార్ గా కొనసాగడం అందరికి సాధ్యం అయ్యే పని కాదు. కాని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో మాత్రం దాదాపు 60 ఏళ్లకు పైగా ఇండస్ట్రీని రారాజుగా ఏలుతూనే ఉన్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో?

సినిమాల్లో ఎంత పెద్ద హీరో అయినా స్టార్‌డమ్ అనేది కొంతకాలానికి పరిమితమౌతుంది. ఇది అందరికి తెలిసిన మాటే. కానీ కొందరు అరుదైన వ్యక్తులు మాత్రం ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగుతూ.. దాన్ని తుది వరకు నిలబెట్టుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, లోక నాయకుడు కమల్ హాసన్ ఒకరు.
బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన కమల్, ప్రస్తుతం కూడా సోలో హీరోగా సినిమాల్లో నటిస్తూ తన పాపులారిటీని కొనసాగిస్తున్నారు. దాదాపు 60 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తూనే ఉన్న అరుదైన ఫిల్మ్స్ స్టార్స్ లో కమల్ హాసన్ ఒకరు. ఆయన 1960లో వెండి తెరపై అడుగుపెట్టి, అనేక భాషల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. కమల్ హాసన్ మొదటిసారిగా బాల నటుడిగా నటించిన చిత్రం కలతూర్ కన్నమ్మ (1960), ఆయన వయసు అప్పటికి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే.
కలతూర్ కన్నమ్మ సినిమాలో కమల్ మహానటి సావిత్రితో కలిసి నటించారు. అందుకే సావిత్రిని అమ్మా అని పిలవడం కమల్ కు అలవాటు. బాల నటుడిగా మరిన్ని సినిమాల్లో నటించిన తర్వాత, 1974లో ‘కన్యాకుమారి’ అనే సినిమాలో హీరోగా తొలిసారి నటించే అవకాశాన్ని పొందారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కమల్ కెరీర్ పరుగులు పెట్టింది. అంతే కాదు ఈ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు కమల్‌కు తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డును తీసుకొచ్చింది.
కమల్ హాసన్ ఇప్పటివరకు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో నటించారు. ఆయనకు ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలపై కూడా పట్టు ఉంది. భిన్న భాషలతో సినిమా ఇండస్ట్రీల్లో తనదైన ముద్రవేసిన ఆయన, భారతదేశపు మొదటి మల్టీలాంగ్వేజ్ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు.
సినిమా కోసం ఎంత సాహసం చేయడానికి అయినా కమల్ వెనకాడడు. సినిమాల కోసమే క్లాసికల్ డాన్స్, మ్యూజిక్, ఫైట్స్ లాంటివి వయసుతో సంబంధం లేకుండా నేర్చుకున్నాడు కమల్. రీసెంట్ గా థగ్ లైఫ్ సినిమా కోసం ఫారెన్ వెళ్లీ ఈ వయస్సులో కూడా స్టూడెంట్ గా ఓ కోర్స్ కూడా కంప్లీట్ చేసి వచ్చాడు కమల్.
కమల్ హాసన్ ఇప్పటివరకు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో నటించారు. ఆయనకు ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలపై కూడా పట్టు ఉంది. భిన్న భాషలతో సినిమా ఇండస్ట్రీల్లో తనదైన ముద్రవేసిన ఆయన, భారతదేశపు మొదటి మల్టీలాంగ్వేజ్ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు. సినిమా కోసం ఎంత సాహసం చేయడానికి అయినా కమల్ వెనకాడడు. సినిమాల కోసమే క్లాసికల్ డాన్స్, మ్యూజిక్, ఫైట్స్ లాంటివి వయసుతో సంబంధం లేకుండా నేర్చుకున్నాడు కమల్. రీసెంట్ గా థగ్ లైఫ్ సినిమా కోసం ఫారెన్ వెళ్లీ ఈ వయస్సులో కూడా స్టూడెంట్ గా ఓ కోర్స్ కూడా కంప్లీట్ చేసి వచ్చాడు కమల్.
కమల్ హాసన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న అరుదైన రికార్డ్ సాధించారు. సౌత్ సినిమాల్లో 19 సార్లు, హిందీలో రెండు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. కొత్త తరం నటులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిల్మ్‌ఫేర్ అసోసియేషన్ నుంచి కమల్ హాసన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారని సమాచారం.
ఆర్థికంగా కూడా కమల్ హాసన్ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 1994లో రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి ఇండియన్ నటుడిగా చరిత్రలో నిలిచారు. ప్రస్తుతం ప్రతి చిత్రానికి రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి.మరి నిజం ఏమిటో తెలియాల్సి ఉంది. ఇక తన లైఫ్ ను చాలా లగ్జరీగా, కంఫర్ట్ గా కొనసాగిస్తుంటారు కమల్ హాసన్. ఏ విషయాన్ని ఇబ్బందిగా, ఇష్టంలేకండా చేయడం ఆయనకు నచ్చదు.
కమల్ హాసన్ లగ్జరీ లైఫ్‌స్టైల్ లో భాగంగా చెన్నైలో భారీ ఇల్లు కలిగి ఉన్నారు. ఆయన ఇంటి విలువ దాదాపు 131 కోట్లు ఉంటుందని అంచనా. అంతేకాదు, ఆయనకు లండన్‌లో కూడా ఒక విలాసవంతమైన బంగ్లా ఉందని సమాచారం. బిగ్ బాస్ తమిళ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ కోట్లు వసూలు చేశారు కమల్ హాసన్.
ఇవి కాక బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, నిర్మాణ సంస్థ ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు.మనీ కంట్రోల్ రిపోర్ట్స్ ప్రకారం, కమల్ హాసన్‌కు ఉన్న ఆస్తుల మొత్తం విలువ 600 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. లగ్జరీ కార్లు, విదేశాల్లో ప్రాపర్టీలు కలిగి ఉన్న ఆయన బహుళ ఆస్తుల క్రమంలో టాప్ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచారు.
ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్, తాను స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ ద్వారా పార్లమెంట్ కు కూడా ప్రవేశించారు. నటనతో పాటు సామాజిక సేవ పట్ల చూపిన ఆసక్తి ద్వారా ఆయన ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు.
చిన్న వయసులోనే సినీ ప్రపంచంలో అడుగుపెట్టి, ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉండటం, ఇప్పటికీ సోలో హీరోగా సినిమాలు చేయడం, భారీగా ఆస్తులు కలిగి ఉండటం వంటి అంశాల వల్ల కమల్ హాసన్ నిజమైన లెజెండ్‌గా నిలిచారు.