Asianet News TeluguAsianet News Telugu

Bigg boss telugu 5: బాలయ్య గా సన్నీ, పవర్ స్టార్ గెటప్ లో మానస్... స్టార్స్ ఎపిసోడ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్

హౌస్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ స్టార్స్ గెటప్స్ ధరించాలని బిగ్ బాస్ ఆదేశించారు. తాము కోరుకున్న స్టార్స్ గెటప్స్  కంటెస్టెంట్స్ ధరించారు. ఈ క్రమంలో  సన్నీ బాలయ్యగా మారిపోగా.. శ్రీరామ్ చిరంజీవి గెటప్ వేశారు.

bigg boss telugu 5 contestants turned super stars
Author
Hyderabad, First Published Dec 9, 2021, 3:26 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్ బాస్ (Bigg boss telugu 5) ఫైనల్ కి చేరువౌతుండగా.. చివరి ఎపిసోడ్స్ మరింత ఎంటర్టైనింగ్  గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు ఎపిసోడ్స్ లో హౌస్ మేట్స్ ఒకరి పాత్రలు మరొకరు చేసేలా.. గెటప్స్ వేసి అలరించారు. ముఖ్యంగా ప్రియాంక గెటప్ లో సన్నీ, మాసస్ ఆకట్టుకున్నారు. ఇక తాజా ఎపిసోడ్ లో కూడా ఈ తరహా గేమ్స్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.హౌస్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ స్టార్స్ గెటప్స్ ధరించాలని బిగ్ బాస్ ఆదేశించారు. 

తాము కోరుకున్న స్టార్స్ గెటప్స్  కంటెస్టెంట్స్ ధరించారు. ఈ క్రమంలో  సన్నీ బాలయ్యగా మారిపోగా.. శ్రీరామ్ చిరంజీవి గెటప్ వేశారు. మానస్  పవన్ కళ్యాణ్ వేశాడు. కాజల్ శ్రీదేవి గెటప్, సిరి జెనీలియా గెటప్స్ వేశారు. ఈ స్టార్స్ గెటప్స్ లో బిగ్ బాస్ ఆదేశానుసారంగా ఎంటర్టైన్ చేసిన కంటెస్టెంట్స్ కి ప్రేక్షకుల దగ్గర ఓట్లు కోరుకునే అవకాశం దక్కుతుంది. ఇక స్టార్స్ గెటప్స్ లో హౌస్ లో ప్లే చేసిన సాంగ్స్ కి కంటెస్టెంట్స్ ఆడిపాడారు. 

మానస్, కాజల్ కలిసి చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని అబ్బనీ తీయనీ సాంగ్ కి డాన్స్ చేశారు. అలాగే బాలకృష్ణ గెటప్ లో ఉన్న సన్నీ... సిరితో కలిసి లక్స్ పాప.. సాంగ్ కి స్టెప్స్ వేయడం జరిగింది. శ్రీరామ్ చిరంజీవి ముఠామేస్త్రి సినిమాలో సాంగ్ కి డాన్స్ వేయగా.. మానస్ పవన్ గబ్బర్ సింగ్ మూవీలో సాంగ్ కి ఎనర్జిటిక్ స్టెప్స్ వేశారు. 

Also read BiggBoss Telugu 5:శ్రీరామ చంద్ర పాపాలు చేశాడు ఓటు వెయ్యొద్దు..అమ్మాయిలతో అలా.. శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

వీరి నుండి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన కంటెస్టెంట్ కి ప్రేక్షకులను హౌస్ నుండి ఓట్ల కోసం అభ్యర్ధించే అవకాశం దక్కుతుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. ఈ స్టార్స్ స్పెషల్ ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ పంచుతుందన్న భావన కలుగుతుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన ఐదుగురు సభ్యులు ఫైనల్ కి చేరనున్నారు. సిరి లేదా కాజల్ ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారని తెలుస్తుంది. ఇక టైటిల్ ఫేవరేట్స్ గా సన్నీ, షణ్ముఖ్ పేరు వినిపిస్తుంది. అదే సమయంలో శ్రీరామ్, మానస్ కూడా మంచి పోటీఇస్తున్నారు. ఈ సీజన్ లో కూడా టైటిల్ విన్నర్ అబ్బాయే కానున్నాడట. 

Also read Bigg Boss Telugu 5: మీ అమ్మకు హగ్ ఒక్కటే గుర్తుంది, ఇంకేమీ గుర్తులేదు.. సిరిపై ఒక రేంజ్ లో షణ్ముఖ్ ఫైర్

Follow Us:
Download App:
  • android
  • ios