MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 5: మీ అమ్మకు హగ్ ఒక్కటే గుర్తుంది, ఇంకేమీ గుర్తులేదు.. సిరిపై ఒక రేంజ్ లో షణ్ముఖ్ ఫైర్

Bigg Boss Telugu 5: మీ అమ్మకు హగ్ ఒక్కటే గుర్తుంది, ఇంకేమీ గుర్తులేదు.. సిరిపై ఒక రేంజ్ లో షణ్ముఖ్ ఫైర్

బిగ్ బాస్ తెలుగు 5( Bigg Boss Telugu 5) ఎపిసోడ్ 95 ఆసక్తికరంగా సాగింది. సరదాగా ఉంటూనే ఇంటి సభ్యుల మధ్య హాట్ హాట్ గా ఆర్గుమెంట్ జరిగింది. కాజల్, మానస్ ఇద్దరూ సీక్రెట్ గా షణ్ముఖ్, సిరి రిలేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2021, 11:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు 5( Bigg Boss Telugu 5) ఎపిసోడ్ 95 ఆసక్తికరంగా సాగింది. సరదాగా ఉంటూనే ఇంటి సభ్యుల మధ్య హాట్ హాట్ గా ఆర్గుమెంట్ జరిగింది. కాజల్, మానస్ ఇద్దరూ సీక్రెట్ గా షణ్ముఖ్, సిరి రిలేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. షణ్ముఖ్ పూర్తిగా సిరిని కంట్రోల్ చేస్తున్నాడు అని మానస్.. కాజల్ తో అంటాడు. సిరి మానస్ ని ఇష్టపడుతోంది అని కాజల్ బదులిస్తుంది. లివింగ్ ఏరియాలో సన్నీ, షణ్ముఖ్ మధ్య గొడవ మొదలవుతుంది. షణ్ముఖ్ ని సన్నీ ఇమిటేట్ చేస్తాడు. దీనితో షణ్ముఖ్ కి కోపం వస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ విషయంలో తనకు సపోర్ట్ చేయడం లేదని Shanmukh.. సిరిపై కోపగించుకుంటాడు. వారిద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరుతుంది. అందరి ముందు నువ్వే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావ్ అని షణ్ముఖ్ తన బాధని బయట పెడతాడు. సిరిపై గట్టిగా అరిచేస్తాడు. తనకు రెస్పెక్ట్ ఇవ్వడంలో నీకన్నా జెస్సీ ఎంతో బెటర్.. అందుకే నాకు నీకన్నా జెస్సి అంటేనే గౌరవం అని షణ్ముఖ్ సిరిపై అరుస్తాడు. ప్రతి సందర్భంలో నీవల్ల నేను నెగిటివ్ అవుతున్నా. నేను నీకోసం చేసినవి ఏమీ మీ అమ్మకు గుర్తులేవు.. హగ్గు మాత్రమే గుర్తుంది అని అంటాడు. 

36

షణ్ముఖ్ తనపై విపరీతమైన కోపం ప్రదర్శించడంతో సిరి అలిగి మోజ్ రూమ్ కి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత సిరిని ఓదార్చేందుకు షణ్ముఖ్ కూడా వెళతాడు. సిరి కోసం షణ్ముఖ్ దోసెలు తీసుకుని వెళతాడు. దీనితో సిరి నవ్వేసి నార్మల్ అయిపోతుంది. 

46

ఇక హౌస్ లో సభ్యులు ఇతరుల క్యారెక్టర్స్ లో నటించే టాస్క్ చేస్తారు. సన్నీ.. హమీద క్యారెక్టర్ చేస్తాడు. ఆమెలా డ్రెస్, లిప్ స్టిక్ వేసుకుని ఫన్నీగా రెడీ అవుతాడు. హౌస్ లో గతంలో జరిగిన సంఘటనలని ఇంటి సభ్యులు రీక్రియేట్ చేస్తారు. సన్నీ హమీద లాగా డైలాగ్స్ చెబుతూ మంచి ఫన్ జనరేట్ చేస్తాడు. ఇక శ్రీరామ్ కూడా షణ్ముఖ్ పాత్రలో బాగా నవ్వించాడు. సిరి పాత్రలో కాజల్ నటించింది. 

56

షణ్ముఖ్, సిరి మధ్య కోపతాపాలు మినహా ఈ ఎపిపోడ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగింది. ఎప్పటిలాగే కాజల్ తన లౌడ్ వాయిస్ తో ఆకట్టుకుంది. షణ్ముఖ్, సన్నీ మధ్య జరిగిన గొడవలో మానస్ మీడియేటర్ రోల్ పోషించాడు. అయితే అది అంతగా వర్కౌట్ కాలేదు. మానస్ మాటని సన్నీ వినలేదు. అలాంటివి కూడా చేయకుండా, మాట్లాడకుండా బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వేస్ట్ అని సన్నీ అంటాడు. 

66

ఇక చివర్లో చాలా సరదాగా టాస్క్ జరిగింది. హాట్ సీట్ లో కూర్చున్న సభ్యుడిని మిగిలిన వాళ్ళు నవ్వించాలి. మొదట హాట్ సీట్ లో షణ్ముఖ్ కూర్చుంటాడు. షణ్ముఖ్ ని సన్నీ నవ్విస్తాడు. ఇక శ్రీరామ్ ని ఎవ్వరూ నవ్వించలేకపోతారు. మానస్ ని కూడా ఎవ్వరూ నవ్వించలేదు. ఇక సన్నీ, సిరి ఇద్దరూ పలు మార్లు నవ్వేస్తారు. సన్నీ ఫన్నీ డైలాగులు చెబుతూ హాట్ సీట్ లో కూర్చున్న వారిని నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఇలా ఈ ఎపిపోడ్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. Also Read: Ananya Panday: హాట్ కేకులా ఊరిస్తోంది.. రెడ్ డ్రెస్ లో 'లైగర్' బ్యూటీ సోయగాలు

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Recommended image2
Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు
Recommended image3
Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved