తమిళ సినిమాల్లో లేడీ కమెడియన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న మధుమిత తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొంది. అయితే హౌస్ లో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆమెని ఇంటినుండి బయటకి పంపించేశారు. ఈ క్రమంలో తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ తమను బెదిరిస్తోందని విజయ్ టీవీ నిర్వాహకులు చెన్నైలోని గిండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంలో స్పందించిన మధుమిత  విజయ్ టీవీ నిర్వాహకులు తనపై పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేశారో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో కమల్ హాసన్ జోక్యం చేసుకొని.. పరిష్కారం చూపాలని కోరింది. ఈ వివాదం ఓ పక్క సాగుతుండగా.. మధుమితతో పాటు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొని నామినేట్ అయిన నటి మీరామిథున్ ఈ ఇష్యూపై స్పందించింది.

తనకు పారితోషికం విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులతో ఎలాంటి సమస్య తలెత్తలేదని వెల్లడించింది. నటి మధుమిత వ్యక్తిగతంగా ఎలాంటి సమస్య ఎదుర్కొందో తనకు తెలియదని.. తన వరకు అయితే బిగ్ బాస్ సంస్థ మంచి సంబంధాలే ఉన్నాయని, తమని మర్యాదగానే చూసుకున్నారని తెలిపింది. అలానే మరో నటి సాక్షి అగర్వాల్ స్పందిస్తూ.. సభ్యులెవరైనా మధ్యలో బయటకి వచ్చేస్తే ఒప్పందం ప్రకారం మిగిలిన రెమ్యునరేషన్ ని వందరోజులు పూర్తయిన తరువాతనే అందించనున్నట్లు పేర్కొనబడిందని తెలిపింది.

అందుకే తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేసింది. అలాంటిది నటి మధుమిత ఎందుకలా ప్రవర్తించిందో తెలియదని.. ఆమెకి సంబంధించిన ఒప్పందంలో ఏముందో కూడా తనకు తెలియదని సాక్షి చెప్పుకొచ్చింది. 

బిగ్ బాస్ షోలో నటి సూసైడ్ ప్రయత్నం!

రెమ్యునరేషన్ కోసం బిగ్ బాస్ కంటెస్టంట్ బెదిరింపులు!

రెమ్యునరేషన్ అడిగితే కేసు పెడతారా..? బిగ్ బాస్ షోపై నటి ఫైర్!