తమిళ సినిమాల్లో లేడీ కమెడియన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న మధుమిత తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొంది. అయితే హౌస్ లో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆమెని ఇంటినుండి బయటకి పంపించేశారు. ఈ క్రమంలో తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ తమను బెదిరిస్తోందని విజయ్ టీవీ నిర్వాహకులు చెన్నైలోని గిండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన మధుమిత సదరు టీవీ యాజమాన్యంపై మండిపడింది. దాదాపు పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని.. ఇప్పటివరకు తనపై ఎలాంటి కంప్లైంట్ లేదని.. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ అడిగితే కేసు పెడతారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. విజయ్ టీవీ నిర్వాహకులను  తనకు ఇవ్వాల్సిన పారితోషికం అడగగా.. బిల్లు పంపమని అడిగారని.. వారు చెప్పినట్లే బిల్లు పంపించానని.. త్వరలోనే డబ్బులు ఇస్తామని చెప్పినట్లు తెలిపింది.

తమ మధ్య ఎలాంటి సమస్య లేదని.. కానీ సడెన్ గా విజయ్ టీవీ నిర్వాహకులు తనపై పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేశారో అర్ధం కావడం లేదని వెల్లడించింది. విషయం తెలిసి వారికి ఫోన్ చేస్తే స్పందించలేదని.. ఈ విషయంలో కమల్ హాసన్ జోక్యం చేసుకొని.. పరిష్కారం చూపాలని కోరింది.

తను బయటకి రావడానికి సంబంధించిన ఫుటేజీలను ప్రసారం చేయకపోవడం బాధగా ఉందని.. బిగ్ బాస్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఇతర విషయాలను  మాట్లాడలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చింది. 

బిగ్ బాస్ షోలో నటి సూసైడ్ ప్రయత్నం!

రెమ్యునరేషన్ కోసం బిగ్ బాస్ కంటెస్టంట్ బెదిరింపులు!