Asianet News TeluguAsianet News Telugu

60ఏళ్ల వయసులో ఎలా బ్రతకాలో ముందే ప్లాన్ చేశారు.. నాగ్ పై బండ్ల గణేష్ కామెంట్స్

టాలీవుడ్ మన్మధుడు పుట్టినరోజు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు నాగార్జునకు బెస్ట్ విషెష్ తెలియజేశారు. టాలీవుడ్ ప్రముఖులు కొందరు స్పేస్ లో జాయిన్ కావడంతో పాటు, నాగ్ తో తమకున్న అనుభందం గుర్తు చేసుకున్నారు. 

bandla  ganesh made few interesting comments on hero nagarjuna
Author
Hyderabad, First Published Aug 31, 2021, 12:37 PM IST

ఆగష్టు 29న నాగార్జున తన 62వ బర్త్ డే జరుపుకున్నారు. ఈ టాలీవుడ్ మన్మధుడు పుట్టినరోజు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు నాగార్జునకు బెస్ట్ విషెష్ తెలియజేశారు. టాలీవుడ్ ప్రముఖులు కొందరు స్పేస్ లో జాయిన్ కావడంతో పాటు, నాగ్ తో తమకున్న అనుభందం గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన గొప్పతనాన్ని గురించి చర్చించుకున్నారు. ఈ స్పేస్ లో జాయిన్ అయిన బండ్ల గణేష్ నాగ్ గురించి మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 


కొన్నేళ్ల క్రితం బండ్ల గణేష్ నాగార్జునకు ఓ సూచన చేశారట. షాద్ నగర్ లో భూములు చౌకగా ఉన్నాయి. భవిష్యత్ లో మంచి ధర పలికే అవకాశం కలదని, కావున అక్కడ పొలాలు కొనాలని సలహా ఇచ్చారట. దానికి నాగార్జున ఆ పొలాలు కొన్నా, అందులో వ్యవసాయం చేసే నాటికి నా వయసు 60ఏళ్ళు దాటిపోతుందని, నాగార్జున అన్నారట. 


నాగార్జున గొప్ప ప్రణాళిక గల వ్యక్తి. ఆయన 40ఏళ్ల వయసులో ఎలా జీవించాలో, 50ఏళ్లకు ఎలా జీవించాలో, 60ఏళ్ల ప్రాయంలో ఎలా జీవించాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నారని బండ్ల గణేష్ అన్నారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలతో లైఫ్ పట్ల నాగార్జున ఎంతటి పర్ఫెక్ట్ ప్లానింగ్ కలిగి ఉంటారో అర్థం అయ్యింది. 


62ఏళ్ల నాగార్జున ఫిట్నెస్ లో ఇప్పటికీ కొడుకులకు ఛాలెంజ్ విసురుతూ... జస్ట్ 30ప్లస్ లా కనిపిస్తున్నారు. దానికి కారణం ఆయన ఆహార నియమాలు, వ్యాయామం, క్రమశిక్షణతో కూడా దిన చర్య అని చెప్పాలి. కాగా నాగార్జున తన పుట్టినరోజు నాడు రెండు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఘోస్ట్ మూవీ చేస్తున్న ఆయన, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రం సెట్స్ పైకి తీసుకేలరు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios