నందమూరి అభిమానులకు ఉగాది కానుక, NBK 108 నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్
బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న NBK 108 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఉగాది సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు బాలకృష్ణ.

యంగ్ హీరోలను మించి మంచి ఊపు మీద ఉన్నాడు నటసింహం బాలకృష్ణ. అఖండ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలయ్య.. వీరసింహారెడ్డి సినిమాతో.. అదే జోరును కొనసాగిస్తున్నాడు. అటు బుల్లితెరపై కూడా అన్‌స్టాపబుల్ షో తో హిట్ మీద హిట్ కోట్టేస్తున్నాడు సీనియర్ హీరో. ఇవే కాకుండా అటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ.. బాలయ్య మజాకా అనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నాడు. ఇక ఇన్ని చేసినా.. ఫ్యాన్స్ అందరి దృష్టి ఆయన 108వ సినిమాపైనే ఉంది. NBK108 నుంచి అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం ఈసినిమానుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు బాలయ్య.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా NBK108 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. రీసెంట్ గా ఈసినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ పేరును ప్రకటించారు మూవీటీమ్. ఫస్ట్ టైమ్ బాలయ్యతో కాజల్ చిందేయ్యబోతోంది. ఇక బాయల్య కూతురిగా మరో హీరోయిన్ శ్రీలీల NBK 108 సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక మూవీ టీమ్ ఉగాది కానుకగా అప్ డేట్ ఇస్తామని ముందుగానే ప్రకటించారు. అన్నట్టుగానే మూవీ టీమ్ తాజాగా ఉగాది సందర్భంగా NBK 108 సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ పై This time beyond your imagination అని లైన్ రాసి ఉంది. బాలయ్యను ఇంతకు ముందెన్నడు చూపించని విదంగా చూసించబెతున్నాను.. మీ ఊహలకు మించి సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ పోస్టర్ లో బాలయ్యసీరియస్ లుక్ లో నిల్చొని మెలేసిన మీసంతో మేడలో కండువా చుట్టుకొని ఉన్నారు. మరో పోస్టర్ లో బాలయ్య పవర్ ఫుల్ గా చూస్తున్నట్టు ఉంది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా తో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్నాడు నందమూరి నటసింహం.
ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. అన్న దిగిండు..ఈసారి మీకు ఊహకు మించి అంటూ..ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య పోస్టర్లను శేర్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు ముచ్చటగా మూడోసారి తమన్ బాణీలు కూర్చబోతున్నాడు. కామెడీ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న అనిల్ బాలయ్యను ఎలా చూపించబోతున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది.