Asianet News TeluguAsianet News Telugu

Akhanda OTT rights: బాలయ్య అఖండ ఓటిటి రైట్స్ కి భారీ ఆఫర్... నిర్మాతకు కాసుల పంట!

కాలం తర్వాత నాలుగైదు వారాలు ఓ మూవీ నిరవధికంగా థియేటర్స్ లో ఆడుతుంది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదవ వారానికి దగ్గరైంది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలోని కొన్ని కేంద్రాలలో సాలిడ్ వసూళ్లు రాబడుతుంది.

balakrishna akhanda grabs solid ott offer from disney plus hot star
Author
Hyderabad, First Published Jan 5, 2022, 11:02 PM IST

సరైన సినిమా పడితే బాలయ్య (Balakrishna)వసూళ్ల ప్రభంజనం ఎలా ఉంటుందో నిరూపించింది అఖండ. ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుండగా అఖండతో బాలయ్య దాహం తీరింది. ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ బోయపాటితో సాధ్యమైంది. వరుస ప్లాప్స్ లో బాలయ్య మార్కెట్ పది కోట్లకు పడిపోయింది. అలాంటి తరుణంలో అఖండ వంద కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డ్స్ నెలకొల్పింది. బాలయ్య నటించిన గత చిత్రాలు... ఎన్టీఆర్ బయోపిక్స్, రూలర్ కనీస వసూళ్లు రాబట్టలేకపోయాయి. ఆ చిత్రాల వసూళ్లకు అఖండ పదిరెట్లు ఎక్కువ వసూళ్లు అందుకుంది. 

చాలా కాలం తర్వాత నాలుగైదు వారాలు ఓ మూవీ నిరవధికంగా థియేటర్స్ లో ఆడుతుంది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదవ వారానికి దగ్గరైంది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలోని కొన్ని కేంద్రాలలో సాలిడ్ వసూళ్లు రాబడుతుంది. అఖండ (Akhanda) చిత్రాన్ని రిపీట్ ఆడియన్స్ చూస్తున్నారు. ఇక అఖండ వరల్డ్ వైడ్ గా రూ. 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. బాలయ్య కెరీర్ లో అఖండ హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో అఖండ ఒకటిగా రికార్డు నమోదు చేసింది. 

కాగా అఖండ డిజిటిల్ స్ట్రీమింగ్ కి సిద్దమవుతుంది. సంక్రాంతి కానుకగా బుల్లితెరపై అఖండ సందడి చేయనుంది. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అఖండ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ఇక అఖండ కోసం హాట్ స్టార్ భారీగా చెల్లించినట్లు సమాచారం అందుతుంది. దాదాపు రూ. 20 కోట్లకు అఖండ డిజిటల్ రైట్స్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం. 

సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి  అఖండ హాట్ స్టార్ లో సందడి చేయనుంది. అఖండ మూవీపై ప్రేక్షకులలో ఉన్న హైప్ రీత్యా.. భారీగా వ్యూస్ దక్కే సూచనలు కలవు. అలాగే అఖండ చిత్రం వలన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చందాదారుల సంఖ్య కూడా విపరీతం పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఇక అఖండ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీంధర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)హీరోయిన్ గా నటించగా... పూర్ణ కీలక రోల్ చేశారు. శ్రీకాంత్ విలన్ గా సీరియస్ రోల్ చేసి మెప్పించారు. బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేశారు. ముఖ్యంగా అఘోరా పాత్రలో ఆయన శివతాండవం చేశారు. థమన్ సాంగ్స్, బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉంది. 

Akhanda Balakrishna: బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడంటే..? షూటింగ్ కు బాలయ్య రెడీ

కాగా బాలకృష్ణ త్వరలో తన 107వ చిత్రం మొదలుపెట్టనున్నారు. క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని ఈ చిత్ర్రాన్ని తెరకెక్కించనున్నారు. సంక్రాంతి నాడు పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. శృతి హాసన్ (Shruti Haasan)హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వేటపాలెం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Also read NBK 107 Crazy Update: బాలయ్యతో ఢీ కొట్టబోతున్న జయమ్మ.. ఇక వెండితెరపై మోతే..

Follow Us:
Download App:
  • android
  • ios