Balakrishna: బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడంటే..? షూటింగ్ కు బాలయ్య రెడీ
వరుస సినిమాలతో జోరు మీద ఉన్న బాలయ్య.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ షూటింగ్ .. రిలీజ్ గురించి ఇండస్ట్రీలో క్రేజీ రూమర్ నడుస్తోంది.
గ్యాప్ లేకుండా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ(Balakrishna). రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ(Akhanda)తో సెన్సేషనల్ హిట్ కొట్టి బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మలినేని గోపీచంద్ మూవీని స్టార్ట్ చేశారు. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప లో బాలయ్య అంటే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈమూవీలో బాలకృష్ణకు ఆపోజిట్ రోల్ లో.. పవర్ ఫుల్ విలన్ గా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ను తీసుకున్నారు టీమ్. ఇక బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్(Sruthi Hasan) ఆడి పాడబోతోంది.
ఈసినిమా తరువాత వెంటనే అనిల్ రావిపూడి సినిమాలో జాయిన్ కాబోతున్నారట బాలయ్య. గోపీచంద్ మూవీ పూర్తి కాగానే అనిల్ కు డేట్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథతో Balakrishnaను మెప్పించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. బాలయ్యను డిఫరెంట్ గా చూపించాలని ప్లాన్ చేసుకున్నాడట అనిల్ రావిపూడి.అయితే లైన్ అయితే సెట్ చేసుకున్నాడు కాని కథ విషయంలో ఫినిషింగ్ ఇచ్చే పని మాత్రం మిగిలిపోయిందని సమాచారం.
మలినేని గోపీచంద్ మూవీ షూటింగ్ ఆల్ రెడీ స్టార్ట్ అయ్యింది. ఆయన సినిమాలను పరుగులు పెట్టిస్తాడు. Balakrishna కూడా డైరెక్టర్ చెప్పినట్టు విని షూటింగ్ ను కంప్లీట్ చేస్తాడు.అది బాలయ్యకు మొదటి నుంచీ అలవాటు. ఇక వీరి సినిమాను జూన్ వరకూ కంప్లీట్ అయ్యేలా మూవీ టీమ్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఈలోపు పూర్తి చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇక వెంటనే.. జులైలో అనిల్ రావిపూడి సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడట బాలయ్య.
అనిల్ రావిపూడి కూడా ఎఫ్3(F3) మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈమూవీని ఏప్రిల్ 29 రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తయితన తరువాత అనిల్ ఫ్రీ అవుతాడు. ఇక రెండు నెలల్లో బాలయ్య కోసం కథను రెడీ చేసి.. జులైలో షూటింగ్ ను చేసుకోవాలి అనుకుంటున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి బాలయ్య మూవీని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్టు సమాచారం. అనిల్ కు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే పక్కా హిట్ అన్న నమ్మకం అనిల్ ది. అందుకే బాలయ్యను 2023కి తీసుకురావాలని ప్లాన్.
AlsoRead : Rashmika Mandanna : స్టార్ హీరో సినిమాను కాదన్న రష్మిక..? టాలీవుడ్ వద్దు.. బాలీవుడ్ ముద్దు అంటోంది.
అసలే కరోనా థార్డ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. ట్రిపుల్ ఆర్(RRR) లాంటి సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మరి బాలయ్య సినిమా షూటింగ్ బ్రేక్ లేకుండా సాగితేనే అనుకున్న ప్లాన్స్ వర్కైట్ అవుతాయి. ఈ మధ్యలో ఏ తేడా జరిగినా.. అది అంతే సంగతి. మరి చూడాలి మేకర్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారో.
AlsoRead : NBK 107: బాలయ్య విలన్ గా స్టార్ హీరో