నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `అఖండ 2` సినిమా అప్డేట్ వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ తాజాగా ప్రారంభమైంది. 

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా `అఖండ 2`. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. `అఖండ 2` టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాపై అంచనాలను పెంచింది. 

ఈ క్రమంలో ఈ మూవీ నుంచి మరో అప్‌ డేట్‌ వచ్చింది. సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఇందులో బాలయ్య జాయిన్ అయ్యారు. 

పవన్‌ తో పోటీ నుంచి తప్పుకోబోతున్న `అఖండ 2`

`అఖండ 2` సినిమాని సెప్టెంబర్‌ 25న విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ ప్రకటించింది. కానీ రిలీజ్‌ వాయిదా పడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ `ఓజీ` మూవీ కూడా అదే రోజు రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో `అఖండ 2` వెనక్కి తగ్గే అవకాశం ఉందట.

దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ రావాల్సి ఉంది. కానీ ఈ రూమర్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. `అఖండ 2` లో ప్రజ్ఞ జైస్వాల్, సంయుక్త లతో పాటు చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య మూవీ 

తెలుగు సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని ఒక హిస్టారికల్ ఎపిక్ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. 'NBK111' అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 

జూన్ 10న పుట్టినరోజు జరుపుకునే బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన 111వ సినిమాని అఫీషియల్ గా ప్రకటించారు. 'వీర సింహా రెడ్డి' సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా మూవీ 'పెద్ది' నిర్మాణంతో పాటు వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ భారీ బడ్జెట్ సినిమా 'NBK111' నిర్మిస్తున్నారు.

ప్రకటన పోస్టర్ లో ఒక కోపంతో రగిలిపోతున్న సింహం బొమ్మ ఉంది. జస్ట్ పోస్టరే సినిమాపై అంచనాలను పెంచుతుంది. సింహం మరోసారి గర్జించేందుకు వస్తుందని, ఈ సారి ఆ డోస్‌ ఎక్కువగానే ఉండబోతుందని ఈ పోస్టర్‌ చెప్పకనే చెప్పింది.