బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్యకు మళ్లీ కష్టం వచ్చింది. నయమైన బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది. ఇప్పటికే ఈ క్యాన్సర్ బారిన పడి కోలుకున్న తహీర్‌ కశ్యప్‌ ఇప్పుడు మరోసారి ఈ మాయదారి రోగానికి గురైంది. ఈ విషయాన్ని తెలియజేసూ్తూ తాహిరా కశ్యప్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. మరి ఈ సందర్బంగా ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టే ప్రమాదం ఉంటుందో తెలుసా? ఆ వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.  

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా (Bollywood actor Ayushmann Khurana) అభిమానులకు ఇది చాలా బాధాకరమైన వార్త. ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్(tahira kashyap)కు మళ్లీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. తాహిరా కశ్యప్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

రెండోసారి క్యాన్సర్‌ రావడం పట్ల తాహిరా కశ్యప్‌ ఎమోషనల్‌ పోస్ట్ 

తాహిరా కశ్యప్ ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తనకు క్యాన్సర్ తిరగబెట్టిన విషయం చెప్పారు. జీవితం నిమ్మకాయలు ఇస్తే, నిమ్మరసం చేసుకోండి అని తాహిరా పోస్ట్ కి టైటిల్ పెట్టారు. జీవితం చాలా ఉదారంగా ఉండి, మీకు మళ్లీ నిమ్మకాయలు వస్తే, మీరు దానిని శాంతంగా మీ పానీయంలో వేసుకొని పాజిటివ్ గా తాగవచ్చు.

నా రెండో రౌండ్ మొదలైంది. రెగ్యులర్ చెకప్‌ లు, మామోగ్రామ్లు చెప్పడానికి వెనకాడవు. బ్రెస్ట్ క్యాన్సర్ కి మరోసారి పోదాం. ఏడు సంవత్సరాల చిరాకు, నొప్పి, రెగ్యులర్ ఎనర్జీ తర్వాత నా రెండో రౌండ్ మొదలైంది అని రాశారు. ఆమె ఎమోషనల్‌గా షేర్‌ చేసిన ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్‌ హార్ట్ బ్రేక్‌ అవుతుంది. 

తాహిరా పోస్ట్ చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమెకి ధైర్యం చెబుతున్నారు. మీరు మళ్లీ గెలుస్తారు అని యూజర్లు తాహిరాకు ధైర్యం చెప్పారు. `చింతించకండి, మీ గురించి జాగ్రత్త తీసుకోండి` అని ఒక యూజర్ సలహా ఇచ్చారు. దేవుడు మిమ్మల్ని త్వరగా నయం చేయాలని అభిమానులు ప్రార్థిస్తున్నారని తెలిపారు. 

2018లో మొదటిసారి బ్రెస్ట్ క్యాన్సర్ :

తాహిరాకు బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ వచ్చింది. 2018లో తాహిరాకు మొదటిసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. చాలా పోరాటం తర్వాత ఆమె క్యాన్సర్ ని గెలిచారు. ఇప్పుడు మళ్లీ క్యాన్సర్ వచ్చింది.

View post on Instagram

బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెడుతుందా ? :

ఒకసారి నయమైన బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ రాదని చెప్పలేం. ట్రీట్మెంట్ తర్వాత నెలల గ్యాప్‌తోనూ లేదా సంవత్సరాల తర్వాత కూడా బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ రావచ్చు. సర్జరీ సమయంలో కొన్ని క్యాన్సర్ కణాలు బతకవచ్చు. లేదంటే రేడియేషన్, కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌ సమయంలో కూడా బతకవచ్చు. పరీక్షలు వాటిని గుర్తించేంత సున్నితంగా ఉండవు. ట్రీట్మెంట్ తర్వాత మిగిలిపోయిన ఒకే ఒక్క క్యాన్సర్ కణం కూడా మళ్లీ గడ్డ అవుతుంది.

క్యాన్సర్‌ తిరగబెట్టే ప్రమాదం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అసలు క్యాన్సర్ పెద్దగా ఉంటే, ఎక్కువ స్టేజ్లో ఉంటే, తిరగబెట్టే ప్రమాదం ఎక్కువ ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్‌ కి ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తికి కొత్తగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, అది మొదటిదానికి సంబంధం ఉండదు. దీనిని రెండో ప్రైమరీ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు, ఇది బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టడం కంటే వేరుగా ఉంటుంది.

ఈ క్యాన్సర్‌ ఎవరికి ఎక్కువ అవకాశం? :

చిన్న వయసులో ఉన్న మహిళలు, ముఖ్యంగా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి మొదట రోగ నిర్ధారణ చేస్తే, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా, మెనోపాజ్ కి ముందు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసిన మహిళలకు తిరగబెట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది పెద్ద బ్రెస్ట్ గడ్డలు ఉన్న మహిళలకు తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది.

ఎక్కువ బరువు, మెనోపాజ్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం తిరగబెట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా కేర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉంది. 

read more: అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ని షాకిచ్చిన రామ్‌ చరణ్‌.. `పెద్ది` ఫస్ట్ షాట్‌ సరికొత్త రికార్డు

also read: పెళ్లైయ్యాక కూడా శ్రీదేవి, హేమా మాలిని, జయప్రదలతో ఎఫైర్‌ నడిపించిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?