MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ని షాకిచ్చిన రామ్‌ చరణ్‌.. `పెద్ది` ఫస్ట్ షాట్‌ సరికొత్త రికార్డు

అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ని షాకిచ్చిన రామ్‌ చరణ్‌.. `పెద్ది` ఫస్ట్ షాట్‌ సరికొత్త రికార్డు

రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న `పెద్ది` సినిమా గ్లింప్స్ విడుదలైంది. సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీ గ్లింప్స్ వ్యూస్‌ ఇప్పుడు గత సినిమాల రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం. గతంలో టాప్‌లో ఎన్టీఆర్‌ నటించిన `దేవర` మూవీ గ్లింప్స్ మొదటి స్థానంలో నిలవగా,  అల్లు అర్జున్‌ హీరోగా నటించిన  `పుష్ప 2` రెండో స్థానంలో నిలిచింది. తాజాగా వీటి రికార్డులను రామ్‌ చరణ్‌ `పెద్ది` మూవీ గ్లింప్స్ బ్రేక్‌ చేసింది. మరి ఇంతకి ఎంత వ్యూస్‌ వచ్చాయనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 07 2025, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ntr, allu arjun, ram charan

ntr, allu arjun, ram charan

రామ్‌ చరణ్‌ నటిస్తున్న `పెద్ది` మూవీ గ్లింప్స్ విడుదలైంది. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఆదివారం విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ ఇప్పుడు దుమ్మురేపుతుంది. తెలుగులో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. అల్లు అర్జున్‌ `పుష్ప 2`, ఎన్టీఆర్‌ `దేవర` చిత్రాలకు పెద్ద షాకిచ్చింది రామ్‌ చరణ్‌ `పెద్ది`. మరి ఆ కథేంటో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
peddi, ram charan

peddi, ram charan

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్‌ ఇందులో హీరోయిన్‌. చరణ్‌ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంది. విశేషంగా వైరల్‌ అయ్యింది. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ని విడుదల చేశారు.

ఫస్ట్ షాట్‌ పేరుతో `పెద్ది` సినిమాలోని చరణ్‌ పాత్రని పరిచయం చేసింది టీమ్‌. ఉత్తరాంధ్ర యాసలో చరణ్‌ చెప్పే డైలాగ్‌లు, ఆయన పాత్ర తీరు తెన్నులు, ఇప్పుడు బతికున్నప్పుడే ఏదో ఒకటి చేయాలని ఆయన క్రికెట్‌ గ్రౌండ్‌లోకి దిగిన తీరు అదిరిపోయింది. 
 

35
Ram Charan Peddi Movie

Ram Charan Peddi Movie

ప్రస్తుతం `పెద్ది` గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. నెటిజన్లని అలరిస్తుంది. ఈ గ్లింప్స్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలైంది. రిలీజ్‌ అయిన 24 గంటల్లోనే రికార్డు వ్యూస్‌ పొందింది.

దీనికి 36.5 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం. అంతేకాదు టాలీవుడ్‌ లో నెలకొన్న గత రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేసింది. బన్నీ, ఎన్టీఆర్‌ల సినిమాల రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం. 

45
`దేవర`లో ఎన్టీఆర్‌

`దేవర`లో ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ నటించిన `దేవర` మూవీ గ్లింప్స్ ఇప్పటి వరకు టాప్‌లో ఉంది. దీనికి 28.7 మిలియన్స్ వ్యూస్‌ వచ్చాయి. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` గ్లింప్స్ రెండో స్థానంలో ఉంది. దీనికి 27.12 మిలియన్స్ వచ్చాయి. 

55
`పుష్ప 2`లో అల్లు అర్జున్‌

`పుష్ప 2`లో అల్లు అర్జున్‌

ఇక అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2` గ్లింప్స్ కూడా 27.11 తో మూడో స్థానంలో నిలిచింది. `పుష్ప 2`కి సుకుమార్‌ దర్శకత్వం వహించగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.

వీటి తర్వాత `కల్కి` 23.1 మిలియన్ వ్యూస్‌, `గుంటూరు కారం` 21.1 మిలియన్స్ వ్యూస్‌ని సాధించి టాప్‌ 5లో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీటి రికార్డులన్నింటినీ `పెద్ది` దాటేసింది. సరికొత్త సంచలనంగా నిలిచింది. 

read  more: `దళపతి` లోని `చిలకమ్మా చిటికేయంగా` పాట వెనుక క్రేజీ స్టోరీ.. ముంబయి మ్యూజీషియన్లకి మైండ్‌ బ్లాక్‌

also read: OTT Series: డబ్బుల కోసం భార్య చేత సాని పని చేయించిన భర్త.. ఈ మలయాళ కామెడీ థ్రిల్లర్‌ చూస్తే నవ్వులే నవ్వులు
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Recommended image2
Singer Jhansi Remuneration: సింగర్‌ ఝాన్సీ బిగ్‌ బాస్‌ పారితోషికం.. 8 వారాలకు ఇంతేనా?
Recommended image3
Jailer 2 Movie 17 Days Collections: జైలర్‌ 2 అరుదైన రికార్డు.. 17వ రోజు రజనీ మూవీ అదిరిపోయే వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved