నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కించిన అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తొలి సినిమాతోనే తన మార్క్ చూపించిన ప్రశాంత్‌, కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ తరువాత లాంగ్‌ గ్యాప్ తీసుకున్న ప్రశాంత్‌ వర్మ రాజశేఖర్‌ హీరోగా కల్కి సినిమాను తెరకెక్కించాడు. పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించాడు ప్రశాంత్‌ వర్మ. అయితే రెండు సినిమాలు ప్రశాంత్ వర్మకు దర్శకుడిగా మంచి పేరు తీసుకువచ్చిన కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌ ఇవ్వలేకపోయాయి.

ఈ రెండు సినిమాల తరువాత అప్పటికే కొంత షూటింగ్ జరుపుకున్న ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు ప్రశాంత్ వర్మ. షో ఫేం నీలకంఠ దర్శకత్వంలో మొదలైన బాలీవుడ్‌ సూపర్‌ హిట్ క్వీన్‌ రీమేక్‌ దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఇంకా రిలీజ్ కానీ ఈ సినిమాకు దర్శకుడిగా క్రెడిట్ తీసుకోలేదు ప్రశాంత్ వర్మ. రెండు డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకున్న ఈ యువ దర్శకుడు తన మూడో సినిమాకు రెడీ అయ్యాడు. అంతేకాదు తన మూడో సినిమాలో కూడా తొలి రెండు సినిమాలకు ఫాలో అయిన ఫార్ములానే ఫాలో అవుతున్నాడు.

ప్రశాంత్ వర్మ ఇప్పటికే తెరకెక్కించిన రెండు సినిమాల విషయంలో ఒకటే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే సినిమా క్లైమాక్స్‌ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. తన మూడో సినిమా విషయలో అదే ఫార్ములాను ఫాలో అవ్వబోతున్నాడు ప్రశాంత్. అదే విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించాడు ప్రశాంత్ వర్మ. `క్లైమాక్స్‌ ట్విస్ట్‌ను ఫస్ట్‌ లుక్‌ లో హింట్ ఇవ్వటం.. నా నెక్ట్స్ సినిమా ఫస్ట్ లుక్‌ను మీకు చూపించకుండా ఉండలేకపోతున్నా` అంటూ ట్వీట్ చేశాడు ప్రశాంత్ వర్మ. తొలి రెండు సినిమాల్లో డిఫరెంట్ స్ట్రాటజీలను ఫాలో అయిన ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సినిమాను ఎలా తెరకెక్కించబోతున్నాడా.?! అని అభిమానులు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు.