దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’కు సంబంధించిన మరో అప్‌డేట్ ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టీ నటిస్తున్న ఈ సినిమాలో వైఎస్సార్ సతీమణి విజయమ్మ పాత్రలో నటించబోయేదెవరనే అంశంపై ఆసక్తిదాయకమైన పేరు వినిపిస్తుంది. ఇప్పటికే విజయమ్మ పాత్ర విషయంలో పలువురు నటీమణుల పేర్లు వినిపించాయి. 

ఇప్పుడు మరో నటి పేరు వినిపిస్తుండటం గమనార్హం. ఈమె బాహుబలి పార్ట్ టూలో నటించిన నటీమణి. ఆమె పేరు అశ్రితా వేముగంటి. బాహుబలి 2లో అనుష్కకు వదిన పాత్రలో నటించారీమె. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఈమె, బాహుబలి రెండో భాగంలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఈమెను ‘యాత్ర’లో విజయమ్మ పాత్రకు తీసుకుంటున్నారట.