- Home
- Entertainment
- Radhika Pandit: యష్ వైఫ్ రాధికా పండిట్ ఎన్ని హిట్స్ ఇచ్చారో తెలుసా? సినిమాలకు ఎందుకు దూరమైంది?
Radhika Pandit: యష్ వైఫ్ రాధికా పండిట్ ఎన్ని హిట్స్ ఇచ్చారో తెలుసా? సినిమాలకు ఎందుకు దూరమైంది?
Radhika Pandit:: శాండల్ వుడ్ సిండ్రెల్లా రాధికా పండిట్ పుట్టినరోజు వేడుకల్లో ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలను అందించిన ఈ అందాల తార గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.

Radhika Pandit
శాండల్ వుడ్ సిండ్రెల్లా, యష్ సామ్రాజ్యపు రాణి, బాక్స్ ఆఫీస్ క్వీన్, అమ్మ నాన్నల ముద్దుల కూతురు, అత్తామామల బెస్ట్ కోడలు రాధికా పండిత్ శుక్రవారం పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్‌గా అందుకున్న విజయాలు, మైల్ స్టోన్స్ గురించి తెలుసుకుందాం.
Radhika Pandit
2008లో `మొగ్గిన మనస్సు` చిత్రం ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాధికా పండిట్. మొదటి సినిమానే 100 రోజులు ప్రదర్శించబడింది , ఇది బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది.
Radhika Pandit
సుమారు 25 సినిమాల్లో నటించిన రాధికా పండిట్ 2010లో `కృష్ణన్ లవ్ స్టోరీ` చిత్రం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇందులో అజయ్ రావు సరసన నటించారు. ఆమెకిది పెద్ద బ్రేక్ నిచ్చిన మూవీ అని చెప్పొచ్చు.
Radhika Pandit
ఆ తర్వాత పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, లూస్ మాదా యోగి, శ్రీనగర్ కిట్టి నటించిన `హుడుగారు` సినిమాలో గాయత్రిగా మెరిసింది. ఈ మూవీ కూడా రాధికాకి మంచి పేరుని తెచ్చిపెట్టింది. కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కేలా చేసింది.
Radhika Pandit
`అలెమారి`, `ఓలవే జీవన సాక్షాత్ కార`, `లవ్ గురు`, `గాన బజాన`, `బ్రేకింగ్ న్యూస్`, `18నే క్రాస్`, `కడ్డీపుడి`, `జూమ్`, `ఎందెండిగు`, `దొడ్డ మనే హుడుగ` సినిమాల్లో నటించారు. తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రాధికా పండిట్.
Radhika Pandit
సినిమా ప్రయాణం ప్రారంభించే ముందు తన భర్త రాకింగ్ స్టార్ యష్‌తో కలిసి సీరియల్‌లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా `మొగ్గిన మనస్సు`. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
Radhika Pandit
`మొగ్గిన మనస్సు` వంటి డ్రామా చిత్రం తర్వాత `మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి`, `సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్`లో నటించారు. తమ ప్రేమ మరింత బలంగా మారడానికి ఈ సినిమాల పాత్ర ఎంతో ఉంది.
Radhika Pandit
నటుడు యష్‌తో వివాహం తర్వాత రాధికా `ఆదిలక్ష్మి పురాణ` సినిమాను విడుదల చేసి సినిమా ప్రపంచానికి దూరంగా ఉండిపోయారు. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పింది.
Radhika Pandit
ఐరా, అథర్వ్ పుట్టిన తరువాత పూర్తిగా కుటుంబానికి అంకితమయ్యారు. కానీ యష్ సినిమా సెట్‌కు వెళ్లడం, ప్రైవేట్ ఈవెంట్‌లలో పాల్గొనడం చేస్తుంటారు. ఆయన హీరోగా బిజీగా ఉంటున్నారు. `కేజీఎఫ్`తో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే.
Radhika Pandit
ఎంతో మంది కొత్త ప్రతిభావంతులు రాధికా పండిట్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఎంట్రీ ఇస్తున్నారు. రాధికా మళ్లీ సినిమాలు చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఆమె రీ ఎంట్రీ ఇస్తుందా? లేక పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమవుతుందా? అనేది చూడాలి.
Read more: First Salary: రామ్ చరణ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏం చేశాడో తెలుసా? చిరంజీవి కూడా షాక్ అయిన సందర్భం