హిందూదేశమైన భారతదేశంలో సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ జనల్లో భక్తిభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది. తమతమ మనోభావాలకు అనుగుణంగా వారు తమకు నచ్చిన దైవాన్ని ఇష్టపడి, పూజిస్తుంటారు. అలాంటి దేవుళ్ళకు ఏ చిన్నపాటి అవమానం జరిగినా ఎంతమాత్రం సహించరు. తాజాగా ఇదే విషయమై బాలీవుడ్ నటి అంకితా లోఖండేను నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. అంకిత పోస్టు చేసిన  ఫొటోని చూసి ఆమెపై సీరియస్ అవుతున్నారు.

ఇంతకీ జరిగిందంటే.. అంకిత తల్లి ఆమెకు డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేశారంటూ అందుకు సంబంధించిన ఫోటోలను అంకిత తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అంకిత టీషర్ట్, పైజమాతో కనిపించింది. ఆమె ధరించిన పైజమాపై ఓం అని రాసివుంది. దాంతో హిందువులు చాలా మంది ఆమెపై మండిపడుతున్నారు. కొందరు తీవ్ర స్దాయిలో కోప్పడితే..కొందరు సజెస్టివ్ గా చెప్తున్నారు.

ఓ నెటిజన్ ‘మేడమ్ నాకు మీ మీద శత్రుత్వం లేదు. నేను మిమ్మల్ని ఆటపట్టించడం లేదు. మీరు ధరించిన పైజమాపై ఓం అని రాసివుంది. మేము ఓంకారాన్ని సృష్టికి చిహ్నంగా భావిస్తాము. దీనిని మీరు పైజమా రూపంలో ధరించారు. ఈ విషయన్ని మీకు గుర్తు చేస్తున్నాను’ అని రాశారు. మరొక నెటిజన్ ‘ఈశ్వరుని పేరును కాళ్లకు దగ్గరగా ఉంచడం చాలా తప్పు’ అని రాశారు. అయితే ఈ కామెంట్లకు అంకిత స్పందించలేదు.