స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజుపై డైరెక్టర్ అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దిల్ రాజు కాదు రన్నింగ్ రాజు అని అన్నారు. ఇంతకీ అనిల్ ఆ కామెంట్ ఎందుకు చేశారు. కారణం ఏంటి?

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దిల్ రాజ్ ను రన్నింగ్ రాజు అంటూ స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా దిల్ రాజు కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్’ అనే వేదికను ప్రారంభించనున్నారు. కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫామ్‌ ను రూపొందించారు. దీని ద్వారా మంచిమంచి టాలెంట్ ఉన్నవారు ఇండస్ట్రీలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు కల్పించబోతున్నారు.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి దిల్ రాజుకుశుభాకాంక్షలు తెలిపారు. దిల్ రాజు తో పనిచేసిన తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఓ సందేశం విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ, “దిల్ రాజు గారితో నా ప్రయాణం దాదాపు పదేళ్లుగా కొనసాగుతోంది. ‘పటాస్’ తర్వాత ఆయనతో ‘సుప్రీమ్’ సినిమా చేశాను. ఆయన ఎప్పుడూ ఒకేచోట నిలిచే మనిషి కాదు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని వెతుకుతూ ఉండే వ్యక్తి. అందుకే ఆయనను ‘రన్నింగ్ రాజు’ అని పిలవాలనిపిస్తుంది” అని చమత్కరించారు.

 

Scroll to load tweet…

 

అనిల్ రావిపూడి ఈ వీడియో ద్వారా దిల్ రాజు డ్రిమ్స్ గురించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘‘దిల్ రాజు గారు ఇండస్ట్రీలో చాలా జానర్లను ప్రోత్సహించినా, ఇప్పుడు కొత్త ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే వేదికను అందిస్తున్నారు. ఇది యువ ప్రతిభకు గొప్ప అవకాశం అవుతుంది. ఆయన ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్‌సైట్ ను లాంచ్ చేశారు. ముఖ్య అతిథిగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు తమ ఐడియాలను దిల్ రాజు టీమ్‌కు పంపించవచ్చు. వాటిని పరిశీలించి ఎంపిక చేసిన ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ప్రయోగంగా చెబుతున్నారు.